Saturday, 15 December 2018

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

నిత్యం ఐవిఆరెఎస్ కాల్స్, పాలన బావుందా? మీ అభిప్రాయాలు కావాలని. లోకల్ గా ఎన్ని ఇబ్బందులు వున్నా, చంద్రబాబు నాయుడి గొంతుతో అడిగేసరికి, అయ్యో కష్టపడే ఆయన కదా అని, అంతా బావుందని 1 నొక్కేస్తున్నారు.

ఆయన ఏమో, దానిని ముందేసుకొని, ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల సమాచారం మరియు బయటి వ్యక్తుల సర్వేలు, పార్టీ వర్గాలతో సమీక్షలు చేస్తుంటారు.

ఎన్ని గెలుస్తామో చెబుతూ, మీరు పని చేయట్లేదు, అవసరం అయితే మారుస్తా అని చెబుతూ వుంటారు.

నిత్యం ఎమ్మెల్యేలను ఏదో ఒక కార్యక్రమం పెట్టి, స్థానికంగా తిరిగేలా చేస్తున్నారు.

కానీ ఎంతటి క్రీడాకారుడు అయినా, నిత్యం కొంత ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అలా తెలంగాణాలో కాంగ్రెస్స్ తో వెళ్లి, కుళ్లబొడిపించుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ ఆరు నెలలు వుంది. ఆ దెబ్బలకు కారణాలు, అక్కడి వ్యూహాలు అన్నీ ఒక అనుభవం అవుతుంది.

ముఖ్యంగా, ఇక్కడ ఎలా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలో, బాగా గుణపాఠం నేర్చుకొంది.

నిన్నటి నైరాశ్యంలో నుండి అంతర్మధనం మొదలయ్యి, లోతైన విశ్లేషణ దిశగా, లోతు పాతుల అంతర్ముఖ పయనం జరుగుతోంది. పార్టీలో ప్రతి వ్యక్తి ఏమి చెబుతున్నాడో వింటోంది. ఇవన్నీ క్రోడీకరించి ఆలోచనలు కొలిక్కి వచ్చి, తన వ్యూహాత్మక అడుగులు, దాని నుండి ఆశించవచ్చు.

తెలంగాణాలో ఏదో బాబుగారి పాలన మీద తీర్పు ఇచ్చినట్టు, బాబు గారు అక్కడ సిఎం అవుతానంటే, తెలంగాణా అంతటా తిరస్కరించినట్టు, వైకాపా సంబరపడుతోంది, ఊదరగొడుతోంది.

12 స్థానాల్లో 2 స్థానాల్లో దళితులను గెలిపించుకొని, అక్కడి నుండి కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయించడం మరిచిపోతోంది.

నిజమే, పవన్, జెడి, బిజెపి, జగన్, లెఫ్ట్ మరియు కేసీఆర్ అంతా అంటీ ముట్టనట్టు, విడివిడిగా, మూకుమ్మడి దాడితో, కులం & మతం తో పాటు, అవినీతి ధనంతో, పెద్ద ఎత్తున వస్తారనే విషయం, ప్రతి నాయకుడి నుండి కార్యకర్త వరకు చెప్పి, తెలుగుదేశం తగువిధంగా సిద్ధం చేస్తుంది.

ఎవడు చెప్పినా తనో పెద్ద తోపని, పెడచెవిన పెట్టే జగన్ సహజ గుణం, నంద్యాల & కాకినాడల ఓటమి తరువాత ఏమీ నేర్చుకొన్నట్టు, కనిపించడం లేదు.

అదే జరిగి వుంటే కోడికత్తిని ఒక జాతీయ స్థాయి సమస్యగా ఇంకా చిత్రీకరించడానికి నానా పాట్లు పడుతూ, తుఫాన్ లాంటి విషయాల మీద నిర్లక్ష్యం వహించేది కాదు.

నాలుగు రోజులు ముందు, కేంద్ర కరువు బృందం, రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు తో సమీక్ష చేస్తుంటే, కనీసం తన వైకాపా బృందంతో, ప్రతిపక్ష పార్టీగా వినతి పత్రం ఇవ్వాలని విషయం కూడా మరిచిపోయి, కరపత్రం ద్వారా కరువని కన్నీరు కార్చి, సీఎం ఎంతడిగాడో వార్త వేశారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.

అక్కడ తెలుగుదేశం ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచివుంటే మళ్లీ కేసీఆర్ కొనుగోళ్లతో మరింత కుమిలేది. దానితో పాటు ఒరిగేది ఏమీ లేకున్నా, ఇక్కడ కన్నూమిన్నూ గానకుండా వచ్చే ఎన్నికలకు వెళ్లేవారు.

ఇప్పుడు భూమి మీద నిలబడేలా ఆలోచనలు & ఉపాయాలు చేసి వెళుతుంది.

దానికి దేశంలో 4 దశాబ్దాలకు పైగా, అత్యంత అనుభవం వున్న నాయకుడు వున్నాడు.

..చాకిరేవు.(సౌజన్యం తో )

Popular Posts