ఈ ఏడాది ప్రముఖ సామజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ ఏ విషయాలను ఎక్కువగా మాట్లాడారు, వేటిని ఎక్కువగా మెచ్చరు అనే జాబితాని ట్విట్టర్ ఇండియా 2018 తాజాగా విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయన సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ కార్వా చౌత్ వేడుకలు చేసుకున్న ఫోటో నెటిజన్స్ అత్యంత ఇష్టమైందిగా నిలిచింది.
అక్టోబర్ నెలలో విరుష్క దంపతులు కార్వాచౌత్ వేడుకలను జరుపుకొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వెన్నెల వెలుగులో ఉన్న ఫొటోను విరుష్క జంట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఏడాది అత్యధిక మంది నెటిజన్లు మెచ్చిన ఫొటోగా ఇది నిలిచింది. ఈ ఫొటోకు దాదాపు 2,15,000 లైక్స్ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం మీద భారత్‌లో ఎక్కువగా ట్రెండ్ అయిన 10 హ్యాష్‌ట్యాగ్‌లలో ఏడు దక్షిణ చిత్రపరిశ్రమకు చెందినవే కావడం గమనార్హం.