గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ముద్దుగుమ్మ రష్మిక మండన్న గతంలో కన్నడ నటుడు రక్షిత్ తో చేసుకున్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమా విజయంతో కోట్ల పారితోషికాలు ఈమెకు వస్తున్న కారణంగా రక్షిత్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని విమర్శలు వచ్చాయి. కన్నడ నటుడు రక్షిత్ అభిమానులు ఈ విషయంలో రష్మిక పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగులో ఆమె నటించిన సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వస్తున్న కారణంగానే నిశ్చితార్ధం రద్దు చేసుకున్నట్లుగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియా వార్తలపై రక్షిత్ స్పందించాడు. రష్మికపై విమర్శలు ఆపండి, ఇద్దరం చర్చించుకొని నిశ్చితార్ధం రద్దు చేసుకున్నామని, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
గత కొన్నిరోజులుగా తమ మధ్య కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. ఆ విభేధాల కారణంగానే తాము కలసి జీవించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని, అంతే కానీ ఆమెను ఎవరు ట్రోల్ చేయొద్దని రక్షిత్ కోరాడు. తమ ఇద్దరి అభిప్రాయాలూ కలవకపోవడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయంలో ఆమె ఒక్కదాన్ని బలిచేయడం సరైనది కాదని రక్షిత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు