Thursday, 27 September 2018

బిగ్ బాస్ నుంచి మరో లీక్

నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ వారమే బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరు అనేది తెలిపోనున్నది. విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతుంది. మొదటి నుంచి బిగ్ బాస్ లో జరగబోయే ఎలిమినేషన్స్ ముందుగానే తెలిసిపోతున్నాయి.

ఇప్పుడు అదే జరిగింది. ఈరోజు జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో దీప్తి బయటకు వేల్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన ఓట్ల ద్వారా ఈ విషయం చెబుతున్నారు. కౌశల్, గీత, సామ్రాట్, తనిష్ ఈ నలుగురిలో ఫైనల్ వీక్ జరనుంది. వీరిలో ఇద్దరిని శనివారం ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఆఖరి ఎపిసోడ్ ఆదివారం రోజున మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు.

Popular Posts