Thursday, 6 September 2018

ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం

కేరాఫ్ కంచరపాలెం సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినీ హీరో రానా మాట్లాడుతూ....కంచరపాలెం సినిమాని వరల్డ్ ఫెమస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

'ఈనెల 7న మీ ముందుకు రాబోతుంది. కంచపాలెంతో పాటు నేనున్నా... ఈ సినిమాని వరల్డ్ ఫెమస్ చేద్దాం. మీలో ఎంతో మంది కళాకారులూ ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపిద్దాం. ఈ సినిమాలో కళాకారులు చాలా బాగా చేశారు. వీరు చేసిన దానిలో పదిశాతం నేను చేసుంటే.... కమల్ హాసన్ అయిపోతాను. పెద్ద స్క్రీన్ లో ప్రపంచమంతా చూడాలి' అంటూ ప్రశంసలు కురిపించారు.

Popular Posts