బిగ్ బాస్ 2 షో బలమైన కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న గీతామాధురిపై కొన్ని రోజులుగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో కొందరు ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మరో కంటెస్టెంట్ కౌశల్ ను తన పవర్స్ ఉపయోగించి ఈ సీజన్ ముగిసే సరికి ప్రతివారం నామినేట్ అయ్యేలా గీతామాధురి చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. నెగిటివ్ కామెంట్స్, విమర్శలు ఒకే కానీ... బూతులు తిడుతూ కొందరు అసభ్యమైన కామెంట్స్ చేస్తుండడంతో గీతా మాధురి భర్త నందు రంగంలోకి దిగారు. బిగ్ బాస్ అనేది కేవలం గేమ్ షో. అందులో జరిగే పరిణామాలపై అభిప్రాయాలూ వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం సరికాదు.
ఓ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు.... అని గీతా మాధురి భర్త నందు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు. అయితే తను పోస్టు చేసిన వీడియో వల్ల నెగెటివిటీ మరింత పెరుగుతుందని, కామెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయని, దీని వల్ల గీతా మాధురికి నష్టం జరిగే అవకాశం ఉండటం వల్లనే డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది.