Sunday, 16 September 2018

బిగ్ బాస్ 2 లో గీతకు నాని క్లాస్

బిగ్ బాస్ 2 సీజన్ ఇప్పటివరకు 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో పుర్తికానున్నది. ఈవారం నామినేషన్స్ లో అమిత్, రోల్, కౌశల్, దీప్తి, గీతామాధురిలు ఉండగా తక్కువ ఓట్లు అమిత్, రోల్ రైడాలకు వచ్చాయి. దాంతో వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ తన ప్లాన్ ప్రకారం దీప్తిని బయటకు పంపించబోతుందని టాక్. నిజానికి ఈవారం నామినేషన్స్ లో దీప్తికి ఓట్లు బాగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెని బయటకి పంపితే మరోసారి ప్రజల ఓట్లకు విలువ లేదనే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నది. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాని.. కంటెస్టెంట్ గీతాకి క్లాస్ పీకినట్లు సమాచారం. కౌశల్ పట్ల ఆమె వ్యవహరించిన తీరు పట్ల నానిని ఆమెని ప్రశ్నించి తప్పులు ఎత్తి చూపడంతో గీతా ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు. కౌశల్ ని కూడా టాస్క్ లలో సంచలకుడిగా సొంత రూల్స్ పెట్టుకోవడమేంటని ప్రశ్నించబోతున్నారట

Popular Posts