Sunday, 9 September 2018

పవన్ హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది

పవన్ కళ్యాణ్ తో తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జంగానియా గుర్తుంది కదా...! వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది. చాలా కాలంగా బయట కనిపించని ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది.
తన ఏడేళ్ళ కొడుకుపై చేయి చేసుకున్న పక్క అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యక్తిపై ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పెద్దాయన తన కుమారిడిపై చేయి చేసుకోవడంతో పాటు అపార్ట్ మెంట్ బయటకు గెంటేశాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, సర్దిచెప్పి పంపారని తెలుస్తుంది.

Popular Posts