బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు నటుడిగానే కాకుండా టీవీ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్, దస్ కా దమ్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందించిన సినిమా లవ్ యాత్రి.
వరీన్ హుస్సేన్, అయుష్ శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 5 న విడుదల కానున్నది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్ అయుష్ శర్మ , వరీన్ హుస్సేన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలతో మీడియాతో పంచుకున్నారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ సినిమాలు చూస్తారా అని హీరోయిన్ వరీన్ హుస్సేన్ ని ఓ విలేకరి అడిగాడు.
అయితే టాలీవుడ్ సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ, బాహుబలి సినిమా చూశానని చెప్పింది. అయితే ప్రభాస్ మీకు బాగా నచ్చాడా....ప్రభాస్ నటన ఎలా ఉంది అన్న ప్రశ్నకు అమ్మడు తెల్లముఖం వేసింది. అసలు విషయం ఏమిటంటే....ప్రభాస్ అంటే ఎవరో వరీన్ హుస్సేన్ కు తెలియదట.