Monday, 29 October 2018

1200 స్క్రీన్స్ లో సర్కార్

ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్. మురగదాస్-విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సర్కార్ గతంలో వీరి కాబినేషన్ లో తుపాకీ, కత్తి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
దాదాపు ఈ సినిమాని 1200 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కోలీవుడ్ లో సర్కార్ 83 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, తెలుగు రైట్స్, ఇతర రైట్స్ తో కలిపితే సర్కార్ విడుదలకి ముందే వంద కోట్లు రాబట్టిందని చెప్పొచ్చు.

మరోవైపు, ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ఈ సినిమా కథ నాదే అంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మురుగదాస్‌.. అందులో ఏమాత్రం నిజం లేదు. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు ? అన్న నేపథ్యంలో ఉంటాయి. నా కథలో వివిధ అంశాలని లోతుగా ప్రస్తావించామని తెలిపారు

Popular Posts