హీరోయిన్ త్రిష ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకున్నది. ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నారని, తన పేరుతో పోస్ట్ అయిన మెసేజ్ లను పట్టించుకోవద్దు అని, ఫ్యాన్స్ ఎవరూ రిప్లై ఇవ్వొద్దని ఆమె కోరింది. గతంలో త్రిష అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. త్రిష ప్రస్తుతం రజనీకాంత్ సరసన పెటా సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె కొన్ని రోజులుగా వారణాసిలో ఉంటుంది.
Trisha Account Hacked |