Thursday, 14 July 2011

ఎన్నారైసింహారెడ్డి!

ఒరేయ్ AT&Tగా,  నువ్విచ్చే బోడి పెయిడ్ డీల్సు ఎవడిక్కావాల్రా? ఎత్తి కొట్టానంటే నువ్వూ, నీ సర్క్యూట్సూ పనికిరాకుండాపోతైరా. ఆ తర్వాత గోక్కోటానికి వైర్లు చేతిలో ఉన్నా పీక్కోటానికి ఒక్క కస్టమరూ ఉండర్రా.

నేను ఇండియాలో ఫ్రీ కాల్సు చేసుకున్నా, ఇక్కడికొచ్చి మీ ఊళ్ళో చేసుకున్నా, మా ఫ్రెండ్సుతో కలిసి చేసుకున్నా, సింగిల్గా కూడా చేసుకున్నా. ఒరేయ్, నువ్వే గనక ఓ దమ్మున్న ఫోను కంపనీవోడివైతే, నీకే గనక నన్ను ఫ్రీ ఫోన్ కాల్సు చేసుకోకుండా  ఆపగలిగే కెపాసిటీ ఉంటే, రారా...ఈ రోజు ఈ ఎన్నరైగాడో నువ్వో తేలిపోవాలి.


అరేయ్ RI గుర్తుపట్టావా, నేను NRI గాణ్ణిరా., నేను ఫోనెత్తి హలో..... అని దారుణంగా నోరు తెరిచి పిలిస్తే ఆ పిలుపు వినలేక దెబ్బకి చెవులు చిల్లులుపడి చస్తావ్రా. నేను పర్సనల్గా వచ్చి మాట్లాడటమేంట్రా.


ఇండియా కాల్ కోసం డబ్బు తగలెయ్యకుండా ఫ్రీగా చేసుకోటం ఎలాగో నాకు మా ఫ్రెండ్ అమెరికా పాలతో ఇక్కడికొచ్చిన మొదటి రోజే నేర్పాడ్రా.


నేను ఇండియాకి ఫ్రీగా యాహూలో మాట్లాడా, జీ మెయిల్లో మాట్లాడా. మరీ తిక్కరేగితే ఆఫీసు ఫోనుతో కూడా మాట్లాడా. ఇవ్వాళ ఉన్నపళంగా పెయిడ్ కాల్సు అంటే యెవడు ఒప్పుకుంటాడ్రా? హ్యాక్ చేసైనా ఫ్రీగా మాట్లాడ్తా కానీ, డబ్బులిచ్చి చచ్చినా మాట్లాడన్రా, గుర్తుపెట్టుకో..


ఒరే మామా, ఫోను ఇప్పుడెత్తినా సరే, పొద్దున్నే పళ్ళుతోమకముందెత్తినా సరే. మీకు పనున్నా సరే, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నా సరే. టైమూపాడూ లేకుండా నాకు తిక్కరేగినప్పుడల్లా నేనెక్కడైనా, నేను ఎప్పుడైనా మీకు కాల్ చేస్తా.


రేయ్ బామ్మర్దీ, రెండ్రోజులు నా గొంతు వినపడనంత మాత్రాన, నేను చచ్చాననుకుని పండగ చేసుకుంటార్రా? ఎన్ని గుండెల్రా మీకు? చచ్చింది నేను కాదురా, నా పీసీ. అందుకే మీకు గంటలకొద్దీ ఫోన్ చేసే అవకాశం లేకపోయిందిరా. అయినా ఇవ్వాల్టినుంచి మళ్ళీ వేళాపాళా, వారంవర్జ్యం లేకుండా నేను చేసే కాల్సు దెబ్బకి మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయిరా.


ఒరేయ్, నేను డయల్ చేసిన నంబరు రాంగ్ కాబట్టి నువ్వు ఫోనెత్తి ఛీ పో అని బండబూతులు  తిట్టినా వెనక్కి తగ్గి ఫోన్ పెట్టేస్తున్నారా,ఒరేయ్ అదే కరక్ట్ నంబరై, నువ్వు ఫోన్ ఎత్తకపోయుంటే, నువ్వు ఫోనెత్తే దాకా నీకూ, మీ పక్కింటోడికీ రింగ్ చేస్తూనే ఉండేవాణ్ణిరా.


ఒరేయ్ RI రెడ్డప్పా, ఈ దేశానికొచ్చాక ఫ్రీగా ఇండియాకి ఫోన్ చెయ్యటం మొదలెట్టింది మా నీచం గాడు,  ఆఫీసు ఫోనుతో ఫ్రీగా మాట్లాడ్డం మొదలెట్టింది మా నికృష్టం గాడు, ఇంటర్నెట్లో ఫ్రీగా మాట్లాట్టం మొదలెట్టింది నేను. నువ్వేంట్రా, ఫ్రీ ఫోన్ కాల్సు నిషేధిస్తా...నిషేధిస్తా అంటూ పీకేది?


ఎవడికి ఫోను బిల్లు ఇస్తున్నావో తెలుసామ్మా? ఎవడి పేరు చెబితే ఫోను కంపనీలకి మండుద్దో, ఎవడి ఫోన్ కాలంటే ఇండియాలో చుట్టాలకి కంపరంతో కూడిన దడపుడుతుందో, వాడే వీడు "ఎన్నారైసింహారెడ్డి".


ఒరేయ్ AT&T, నీ దేశానికొచ్చా, నీ ఊరొచ్చా, నీ పేటకొచ్చా, నీ కాలనీకొచ్చా, నువ్వు ఫోను బిల్లు దండుకునే ఇళ్ళల్లోకొచ్చా. నేను ఇక్కణ్ణించే నీ కంటెదురుగానే ఫ్రీగా ఇండియాకి కాల్సుచేస్తారా. ఏం పీకుతావో పీక్కోరా.


ఒరేయ్ Reliance గా, నువ్వేంట్రా పెద్ద పుడింగివా? బాంబులతో కాదురా ఫ్రీ కాల్సుతో చంపుతా.


ఇది చాలు. ఈ నోటికున్న పవర్ చాలు. వారానికో పదిసార్లు నేను చేసే సొల్లు కాల్సు విని అభిమానించి భరించే వాళ్ళని ఆదరించి పొగిడే ఈ నోటికి, ఫోన్ కట్ చేసే వాళ్ళని, ఎంగేజ్లో పెట్టే వాళ్ళని చూస్తే ఆవేశంతో వచ్చేవి పొగడ్తలు కావురా, శాపనార్ధాలు. వినలేక నీ చెవులు చిల్లులు పడతాయి, అటుపై నీ ఫోను వైర్లు కాలిపోతాయ్. ఖబడ్దార్.


ఒసే ప్రొమోషనల్ ఫోన్ కంపనీ, నేను పొట్టకొట్టి కాల్సు చేసుకుంటున్న ఆ ఫోను కంపనీల సాక్షిగా, నాకు బోలెడు బిల్లు అవుతోందని వెర్రిగా నమ్ముతూ నన్ను మెచ్చుకుంటున్న మా ఊరి అమ్మలక్కల సాక్షిగా, నేనే గనక ఓ ఎన్నారై నయితే, నువ్వు ఇయ్యాల కూడా నాకు ఫ్రీ ఫోను మినిట్సు ఇస్తావమ్మా.


లక్షల్లో ఒక్క ఎన్నారైని, లక్ష మందికి ఒక్క ఎన్నారైని.

Popular Posts