
అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు.

