Friday 22 April 2011

ఈ పదాలకు పల్స్ రేట్ లేదు!

నా దగ్గర దేహం ఉంది నీ దగ్గర జీవం ఉందా? వద్దొద్దు..కంగారు పడకు నాకు తెలుసు నీ దగ్గర ఏమీ లేదని.
నువ్వూ నాలాంటి వాడివేనని.అయినా మనం భయపడాల్సిన పనేమీలేదు ఎందుకంటే మన దగ్గర దోచుకొనేదేమీ లేదు కాబట్టి
రకరకాల విబజన రేకల్లో కోతకు గురయ్యాక మనిషి దగ్గర ఇంకేం మిగులుతుంది?కల్లు కరువు దేసాల్లా సిధిలమైపోయాయి.
కన్నీళ్ళు మైళ్ళ లోతుల్లో ఇంకిపోయాయి.లైఫ్ ఈజ్ ఎ బ్రాండ్.నువ్వూ నేనూ ఈ భూమ్మేద టెంపరరీ కస్టమర్స్.జేబులో సొమ్మయిపోగానే
మొహం మీదే షట్టర్ మూసేస్తారు.నీలో సరుకు అయిపోయిందా,ప్రపంచం ఇరుకైపోతుంది.గుర్తుంచుకో,చిర సుపరిచిత ప్రపంచంలో
 అపరిచితులం మనం.లైఫ్ను పేస్లుగా ఎడిట్ చేస్తే లేయర్స్ లోపల నవ్వుల్లేవ్ పువ్వుల్లేవ్,ప్రెమల్లేవ్.ఎవ్రిథింగ్ డిస్కనెచ్టెడ్ సోకాల్డ్ సివిలైజేషన్.
నరాలు తెగినట్టు,వెన్నెముక విరిగినట్టు,గుండె జారినట్టు,నెత్తురు ఆవిరీయినట్టు ప్రెషర్ కుక్కర్లో ఉడికీ ఉడికీ కెంద్ర నాడీ వ్యవస్త
కుప్పకూలుతున్న ఇండికేషన్స్.టో మెనీ కాంప్లికేషన్స్.