Thursday 9 June 2011

చిరంజీవి కొత్త సినిమా!


చిరు రాజకీయ అజ్నాని. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగా తెలియదు. సమస్యలపై అవగాహనా తక్కువే. ఇలా భావించేవాళ్లంతా ఇక చిరు పట్ల ఇక తమ ద్రుక్పథాన్ని మార్చుకోవాలేమో. ఎందుకంటే ఇక నుంచి చిరు సరిగ్గా మాట్లాడే అవకాశముంది. రాజకీయంగానూ సరైన అడుగులు వేసేలా కనిపిస్తున్నాడు. కారణం..  చిరు కొత్తగా నియమించుకున్న రాజకీయ గురువే. అతడే పీసీసీ పీఠాధిపతి బొత్స. ఇంతకుముందు కేవలం రాజకీయ సలహాదారుగా మాత్రమే పనిచేసిన సత్తిబాబు ఇప్పడు పూర్తిస్థాయి గురువు బాధ్యతలను స్వీకరించినట్టు సమాచారం. ఇక నుంచి మెగాస్టారు సత్తిబాబు చెప్పినట్టే  నడుచుకుంటాడట. అలాగని అతడు బొత్స అడుగులకు మడుగులు ఎత్తుతాడని చెప్పి చిరు అభిమానులను నొప్పించను  కానీ పరస్పర ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఒకరికొకరు పూర్తి స్థాయిలో సహకరించుటకైతే ఒక అంగీకారం కుదిరినదట. ఇక ఎప్పడు బొత్స మీట నొక్కితే అప్పడే  చిరు స్వరం ఢిల్లీలో గానీ.. హైదరాబాదులో గానీ వినిపించును. భగవంతునికి, భక్తునికి అనుసంధానం టైపులో ఇక బొత్సకు, చిరుకు మధ్య ఎవరూ లేకపోయినా అప్పడప్పడు ఆ అనుసంధానపు బాధ్యతలను ఘంటా శ్రీనివాసు నిర్వహించునని తెలుస్తున్నది. ప్రజారాజ్యం పోయి. కాపు రాజ్యమొచ్చిన తరుణంలో రెడ్ల రాజ్యాన్ని ఢీ కొనేందుకు ఈ నిర్ణయం అంతరంగిక సమావేశంలో అరవింద్ సమక్షంలో తీసుకున్నారని కాపురాజ్యం ప్రతినిధులు చెబుతున్నారు. మరి సత్తి బాబు డైరెచ్చన్లో చిరంజీవి యిరగదీసి నటిం చే ఈ కొత్త సినిమా  రాజకీయ బాక్సాఫీసు వద్ద  హిట్టవుతుందా.. ఫ్లాపవుతందా అనేది రాజకీయ వెండితెరపై చూడాల్సిందే. అవును సినిమా పేరేమిటో చెప్పలేదు కదూ.. కాబోయే సీఎం. మరయ్యేది చిరంజీవా. డైరెక్టరా అనేది మాత్రం అడక్కండి. అదే సినిమాలో గొప్ప సస్పెన్స్ ఎలిమెంట్. అది చిరంజీవికి కూడా సత్తిబాబు చెప్పలేదట.