Monday, 28 February 2011

మాటలనుండి మౌనంలోకి

మాటలనుండి మౌనంలోకి
ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా అదో దిగులు.ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు.ఇప్పుడు కాస్త అర్దమవుతుంది ఈ దిగులు.
"ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదని.కొత్త రోజు రింగవుతుంది.అంతా ప్రీపెయిడ్.కాలం కస్టమర్ కేర్ లా గైడ్ చేస్తుంది.బైటకి వెళ్ళాలంటే బండి ఆటో స్టార్ట్ ప్రెస్ చేయండి.ప్రమోషన్ రావాలంటే కంప్యూటర్ కీబోర్డ్ అరిగేదాకా ప్రెస్ చెయండి.ఇంటికి వచ్చేముందు ఏ.టి.యం. నెంబర్ ప్రెస్ చెయండి.ప్రెస్,ప్రెస్,ప్రెస్ ఒత్తిడి.తిరిగి హోం మెనూ లోకి రావాలంటే అంతా గజీ,బిజీ.ఈ వత్తిడిలో డ్రాఫ్ట్ నుండి నీ కాల్ వస్తుంది.మైండ్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూనే తర్వాత మాట్లాడతా.
ఓపిగ్గా నీ మాటలు వినాలని,చెప్పాలనిపించి నా మనసు కార్డ్ స్క్రాచ్ చెసి చూస్తే అన్నీ లెక్కతప్పిన అంకెలే. ముందుంచు బూతులు మైనస్లో పడి కలవరపెడతాయి.నా గతం కాల్ డైవర్ట్ అయి ఇప్పటి వరకూ ఎలా గడిచిందీ కాలం?
ఇప్పుడేంటిలా ఏదో పనిలో ఉండగా సెల్ వైబ్రేషన్ లా వళ్ళంతా పాకి ఉలిక్కిపడుతున్నాను.ఎంటో చెప్పు సెల్ని చెవికప్పగించి కంప్యూటర్ లోనుంచి తలతిప్పకుండా నీ లోకంలోకి 'ఎంటర్ ' అయేందుకు విశ్వప్రయత్నం చెసాను.బుజానికీ,చెవికీ మద్య చిక్కుకున్న సెల్ లోనుంచి నీ మాటలు పాదరసంలా జారిపోతాయి.
నీ జ్ఞాపకాలన్నీ ఓ సారి డౌన్ లోడ్ చేసి చూసుకుందా మనుకుంటా! లైఫ్ లైన్లన్నీ గజీ బిజీ అయిపోయి గతం ఎప్పుడూ ఎంగేజ్ వస్తుంది.
నీ మౌనంతో మాట్లాడలని ఉంది.ప్రతి సెకనూ నీ జ్ఞాపకాలకోసం 'పే' చేయాలని ఉంది.
మనసువిప్పి నీతో గంటలకొద్దీ మాట్లాడలని వుంది.కానీ 'స్విచ్ ఆఫ్'.

Popular Posts