Saturday, 31 January 2015

నా పరువు గంగలో కలిపేశారు

తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను నియమించిన విషయం తెలిసిందే. 

అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు.

బాహుబలి సినిమా లీక్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'బాహుబలి' సినిమాకు సంబంధించిన 13 నిమిషాల వీడియో లీక్ అయ్యింది. ఈ విషయమై సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఫుటేజిని నెట్ లోకి అప్ లోడ్ చేశాడు. మూడు రోజులుగా ఇది నెట్ లో హల్ చల్ చేస్తోంది



Friday, 30 January 2015

ఈసారీ సూపర్ ఓవర్

ప్రపంచకప్ ఫైనల్‌పై ఐసీసీ నిర్ణయం
* 2016 మార్చి 11 నుంచి భారత్‌లో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ను అనుమతించాలని ఐసీసీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఇక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసన్ అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. దీంట్లో భాగంగా 2019 వరకు ఐసీసీ ఈవెంట్స్ షెడ్యూల్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మిగతా ఇక్కడ తప్పకుండా చదవండి 

Thursday, 29 January 2015

‘అమ్మ’.. అస్సలు కుదరదంటున్న ఆంటీ!

ఒకప్పుడు చిత్రపరిశ్రమలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు తారలు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్’లోనూ ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే! ఈ జాబితాలో చాలామంది లేరుకానీ.. కొందరు మాత్రం సక్సెస్’ఫుల్’గా దూసుకుపోతున్నారు. హీరోహీరోయిన్లకు అమ్మగానో, ఆంటీగానో, విలన్ల క్యారెక్టర్లలోనో, ఇంకా ఇతరత్ర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి చేరడానికి మరో తార రాశి సిద్ధమవుతోందని తాజా సమాచారం!


దెయ్యాల గదిలో ఒక రాత్రి.. హెడలెత్తిన క్రికెటర్...

పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ పోహల్ కు అరుదైన వింత అనుభవం ఎదురైంది. ఆయనతో ముచ్చటించడానికి దెయ్యాలు వచ్చేశాయి. అదేంటనుకుంటున్నారా..? నిద్రలోకి జారుకున్న వ్యక్తితో దెయ్యాలు మాట్లాడాయి.. అంతే అతన్ని నిద్రలేపాయి. ఈ ఘటనలో ఆయన ఉలిక్కిపడి నిద్రలేచారు. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. దెయ్యాల దెబ్బకు ఆయనకు తీవ్ర జ్వరం వచ్చేసింది. అయితే ఇది జరిగింది తమ నివాసంలో కాదు.. పాకిస్థాన్ లో అంతకన్నా కాదు. న్యూజీలాండ్ లో.. వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. న్యూజీలాండ్ పర్యటనిస్తోంది. ఈ పర్యటనలో పాకిస్థాన్ యువ క్రికెటర్.. పేస్ బౌలర్ హరిస్ సోహల్ కూడా వున్నారు. పర్యటనలో నిమిత్తం న్యూజీలాండ్ చేరుకుని అక్కడ జట్టు ప్రాక్టీసుకు కూడా చేశారు. అనంతరం క్రికెటర్లకు క్రిస్ట్ చర్చ్ హోటల్ లో తనకు కేటాయించిన హోటల్ గదికి వెళ్లాడు. అందరితో కలసి బోజనం చేసిన ఆయన అలసిపోయిన కారణంగా గదికి చేరుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. నిద్రలోకి జారుకున్నాక.. అర్థరాత్రి సమయంలో పోహెల్ ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేచారు. హోటల్ సిబ్బందిని పిలిచారు.

తన గదిలో ఏదో వింత దృశ్యాుల కనిపించాయని, అవి దయ్యాలేనని చెప్పుకొచ్చాడు. నిద్రలో తనను కలవరపెట్టాయని చెప్పారు. తాను ఎంత మాత్రం ఈ గదిలో వుండనన్నాడు. సోహెల్ మాటలతో ఖంగుతిన్న హోటల్ సిబ్బంది.. అతడిని వేరే గదికి మర్చారు. విషయం తెలుసుకున్న సహచర క్రికెటర్లు వచ్చి సోహెల్ ను కొంత ఉపశమన పర్చారు. దీంతో సోహెల్ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు.

యోగా గురు

శక్తి పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యత ఎంత ఎక్కువైతే అంతే స్థాయిలో ఒత్తిడిలు ఉంటాయి. ఆ రెండిటిని సమతుల్యం చేసినపుడే పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ పనితీరు మరింత మెరుగు పరిచేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది. రాష్ట్ర కేబినెట్‌ మంత్రుల నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల వరకు మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగాసనాలలో శిక్షణ ఇప్పిస్తున్నారు.

ప్రముఖ యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌ పేరిట గురువారం నుంచి మూడు రోజుల పాటు యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తొలి రోజు హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌లో, శుక్ర, శనివారాల్లో కొండాపూర్‌లోని సైబర్‌ సిటీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తారు.

హల్‌చల్ చేస్తున్న నయనతార వీడియో!


పాండిచ్చేరిలో బిజీ సెంటర్... అక్కడున్న ఓ మద్యం దుకాణంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటరైంది. ‘బీరు కావాలి?’ అనడిగేసరికి, అందరూ షాక్. డబ్బున్న అమ్మాయిలు కొంతమంది పబ్‌లకెళ్లి, బీరు తాగుతారని తెలుసు కానీ, మరీ ఇలా బహిరంగంగా షాపుకొచ్చి కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరంటే నయనతార. ఇది మళ్లీ షాక్ కదూ

చిరంజీవిని టార్గెట్ చేసిన వర్మ: 150వ సినిమా డైరక్షన్‌పై ట్వీట్స్!

చిరంజీవిని టార్గెట్ చేసిన వర్మ: 150వ సినిమా డైరక్షన్‌పై ట్వీట్స్!

మెగాస్టార్ చిరంజీవిని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశారు. వివాదాస్పద ట్వీట్లతో సంచలనం రేపే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో వివాదం రేపారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150వ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయని పక్షంలో..... 
మిగతా ఇక్కడ చదవండి

ఎన్టీఆర్ పిజ్జా రుచులు

'టెంపర్' షూటింగ్ తో బిజీబిజీగా గడుతుపున్న జూనియర్ ఎన్టీఆర్.. కాసేపు అలా రిలాక్స్ అయ్యారు. మిత్రుడు ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లోకి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతేనా.. వంట గదిలో ప్రవేశించి తన చేతివాటం చూపించారు.


 ప్రకాష్ రాజ్ అండ్ ఫ్యామిలీ కోసం ఓ స్పెషల్ పిజ్జాను ప్రిపేర్ చేశారు జూనియర్. వంటగదిలో గరిటె తిప్పుతూ..మాస్టర్ చెఫ్ గా దర్శనిమిచ్చారు ఎన్టీఆర్. ఈ మోమెంట్ ఎంజాయ్ చేసిన ప్రకాష్ రాజ్ 'తారక్ డార్లింగ్ స్పెషల్ పిజ్జా'' అంటూ ట్విట్టర్ లో ఫోటోలను అప్లోడ్ చేశారు. 

ప్రస్తుతం 'టెంపర్' షూటింగ్ చివరి దశలో వుంది. జనవరి 28న ఆడియో ను రిలీజ్ చేసి, ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని విదులకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి

Wednesday, 28 January 2015

ఆంధ్రా గోబ్యాక్ sorry

విజయవాడ : ఆంధ్రా వాళ్లను ఎప్పుడూ తాము గో బ్యాక్ అనలేదని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఆయన బుధవారం నాడు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తమకు ఎప్పుడైనా నేతలతోనే తగాదా ఉంది తప్ప సామాన్య ప్రజలతో లేదని ఆయన స్పష్టం చేశారు.
అందుకే నాయకులను విమర్శించామే తప్ప.. ప్రజలను ఎప్పుడూ తెలంగాణ నుంచి వెళ్లాలని చెప్పలేదని నాయిని అన్నారు. ఇక మార్చి నుంచి తెలంగాణలోని బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని కూడా ఆయన చెప్పారు.

Tuesday, 27 January 2015

తెలుగు సినిమా ఇండస్ట్రీ గుంటూరు కు ?

కమెడియన్‌ అలీ, గుంటూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, త్వరలో తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు వచ్చేస్తుందని వ్యాఖ్యానించడం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినీ పరిశ్రమలో మెజార్టీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతంపై మమకారం ఎక్కువగా వారు చూపిస్తే తప్పేంటట.? ఆ లెక్కన తెలుగు సినీ పరిశ్రమకు స్థానచలనం తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు కొందరు. మిగతా  ఇక్కడ చదవండి 

Monday, 26 January 2015

బాబు అప్పాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఒబామా..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను స్మార్ట్‌గా మోసం చేస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నవి, లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపుతూ ప్రజలను భ్రమలలో ఉంచుతోందన్నారు.

అధికారం చేపట్టిన ఏడెనిమిది నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ దేశాలను చంద్రబాబు పర్యటించారని, ఆ దేశాల నుంచి ఇంతవరకు ఎంత పెట్టుబడి వచ్చిందో చెప్పాలని సీతారామ్ డిమాండ్ చేశారు. ఎపిలో రూ.254 ఉండాల్సిన యూరియా బస్తాను తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడి నాలుగు వందల రూపాయలకు కొనాల్సి వస్తోందని, రైతులు తీవ్ర సమస్యలలో ఉన్నారని ఆయన అన్నారు. కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని న్నారు.

చంద్రబాబును కలిసేందుకే బిల్ గేట్స్ పడిగాపులు పడ్డారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వ్యంగ్యంగా చెప్పారు. బాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఒబామా కూడా ఆయనను కలవలేదేమోనని సీతారామ్ ఎద్దేవా చేశారు.

ఇలియానా - రవితేజ లకు పుట్టిన కొడుకే ....

ఫొటో ఐడి కార్డులతో ఆధార్ డేటా అనుసంధానం

ఆధార్ డేటాబేస్‌ను ఎలక్టోరల్ ఫొటో ఐడి కార్డులకు అనుసంధానం చేయడానికి ఎన్నికల సంఘం పూనుకుంది. ఎన్నికల జాబితాల్లో ఫోర్జరీలు తదితర దుర్వినియోగాలపై వస్తున్న ఫిర్యాదులను తగ్గించడానికి ఇసి ఈ కార్యక్రమానికి పూనుకుంది. ఆధార్ పేరెంట్ బాడీ అయిన యుఐడిఎఐతో కలిసి ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, 2016 తొలినాళ్ల నాటికి ఇది పూర్తవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) హెచ్.ఎస్.బ్రహ్మ చెప్పారు. 

ఆదివారం ఇక్కడ నిర్వహించిన అయిదో జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అర్హుడయిన ప్రతి ఓటరుకు ఎలక్టోరల్ ఫొటో ఐడి కార్డును అందజేశామని, ఇప్పుడు వాటితో ఆధార్ డేటా బేస్‌ను అనుసంధానం చేయడం వల్ల ఓటర్ల జాబితాలు నూటికి నూరు శాతం తప్పులు లేకుండా ఉంటాయని వివరించారు. రెండింటి సమాచారాన్ని ఒక చోటికి చేరడం వల్ల ఓటర్ల పేర్లు, బయోమెట్రిక్స్, చిరునామాలను సవరించవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల ఎన్నికల జాబితాల గురించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదుల్లో 99శాతం తగ్గిపోతాయని బ్రహ్మ పేర్కొన్నారు. 

రానున్న ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో ఈ డేటా అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఒకవేళ ఆలస్యమయినా 2016 తొలినాళ్ల నాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆధార్ డేటాబేస్‌లో ప్రతి వ్యక్తికి సంబంధించిన అత్యవసరమైన బయోమెట్రిక్స్, ఇతర కీలక సమాచారం ఉంది.

 ఎన్నికల సందర్భంగా పౌరులందరిని భాగస్వాములను చేయడానికి ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. వచ్చే నెల జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని బ్రహ్మ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.

 ఓటు వేయడం అనేది ప్రతి ఓటరు నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. దేశంలో 84 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 55కోట్ల మందే ఓటు వేశారని ఆయన చెప్పారు. మిగతా 30 కోట్ల మందిలో కొందరు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల, మరికొందరు కావాలనే ఓటు వేయలేదని ఆయన తెలిపారు.

 ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఆయన మనందరి కోసం పనిచేస్తాడని బ్రహ్మ ఓటర్లను ఉద్దేశించి అన్నారు.

Sunday, 25 January 2015

ఒబామాకు స్వయంగా టీ కలిపిన మోడీ

న్యూఢిల్లీ: మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిమానాన్ని అడుగడుగునా చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం పాలెం విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఒబామాకు ప్రధాని మోడీనే ప్రోటోకాల్‌ను సైతం మరిచి స్వయంగా ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

రాజ్ ఘాట్‌ను సందర్శించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని మోడీ హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఒబామాతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మోడీ ఆయనతో కలిసి 2.45 గంటలకు 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు.

ఒబామా పర్యటన గురించి మరిన్ని విషయాలు 


ఈ సందర్భంగా ప్రధాని మోడీ.... ఒబామాకు స్వయంగా టీ కలిపి ఇవ్వడం విశేషం. తర్వాత హైదరాబాద్ హౌస్ ఆవరణలో ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు వీరు పలు అంశాలపై చర్చలు జరిగాయి. మరికొద్ది సేపట్లో ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఆత్మీయ అతిథ్యానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముగ్దుడయ్యాడు.

Saturday, 24 January 2015

గెస్ట్-హౌస్ లో హీరోయిన్

Heroine caught in guest house at Hyderabad
ఇక్కడ చదవండి 



     Click Here to Read




పూరీ జగన్నాద్ చెంప పగల కొడతా

పేలిన 'పటాస్'

కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఒక అవినీతిపరుడైన పోలీస్ అధికారి. ఒక గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇతను.. తనను తాను కావాలనే హైదరాబాద్’కి బదిలీ చేయించుకుంటాడు. అక్కడ తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇతను హైదరాబాద్ డిజిపి(సాయికుమార్)కి తలనొప్పిన మారిన రాజకీయ నాయకుడు (అశుతోష్ రాణా)ను ప్రోత్సాహిస్తాడు. దీంతో కళ్యాణ్’కి, డిజిపికి మధ్య విభేదాలు వస్తాయి.

అయితే.. కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి గల అసలు కారణమేంటో డిజిపి తెలుసుకుని షాక్’కి గురవుతాడు. ఇదే ఈ మూవీలో అసలైన ట్విస్ట్. అయితే.. ఆ కారణం ఏంటి? అసలు కళ్యాణ్ కృష్ణ హైదరాబాద్’కి ఎందుకు ట్రాన్స్’ఫర్ చేయించుకున్నాడు..? ఇతనికి, ఆ రాజకీయ నాయకుడికి ఏమైనా లింకుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే.. వెండితెరపై చిత్రాన్ని వీక్షించాల్సిందే!

Friday, 23 January 2015

బీరువాలో ఏముంది ? ? ?


బీరువా చిత్రం నటీనటులు: సందీప్‌ కిషన్‌, సురభి, ముఖేష్‌రుషి, సీనియర్‌ నరేష్‌, శంకర్‌, సప్తగిరి, అజయ్‌ తదితరులు; సంగీతం: థమన్‌, నిర్మాత: రామోజీరావు, సమర్పణ: జెమినీ టీవీ, దర్శకత్వం: కణ్మణి.

సందీప్‌ కిషన్‌ హీరోగా అంటే ఒక తరహాలో కథలు ఎంచుకుంటుంటాడు. అందులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రం పెండ్లి నేపథ్యంలో సాగుతుంది. ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేయడంతో ఆకట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రం 'జోరు' చెత్తగా వుంది. అందుకే మరలా ఎక్స్‌ప్రెస్‌ లాంటి కథనే హీరో నమ్ముకున్నాడు. పదేళ్ళనాడు 'చిన్నోడు' అంటూ సుమంత్‌తో చేసిన కన్మణి టేకింగ్‌ బాగుందనే టాక్‌ వచ్చినా ఎందుకనో ప్రేక్షకులు చూడలేకపోయారు. ఆ తర్వాత మరో సినిమా తీశాడు. అదీ నిరాశ పర్చింది. తాజాగా ఉషాకిరణ్‌ మూవీస్‌ వంటి పెద్ద సంస్థతో చేశాడు. మరి ఏం చెప్పాడో చూద్దాం.



కథ :
కొత్త ఫర్నిచర్స్‌ కొనుక్కున్న ఓ మోడ్రన్‌ అమ్మాయి తన సామాగ్రిలోని బీరువాలో సంజయ్‌(సందీప్‌కిషన్‌)ని చూసి షాక్‌ అవుతుంది. తను దొంగను కాదని.. తన ఫ్లాష్‌బ్యాక్‌ చెబుతాడు. చిన్నతనంలోనే అల్లరి బాగా చేసి తల్లిదండ్రుల్ని ఆటపట్టిస్తుంటాడు. తండ్రి సీనియర్‌ నరేష్‌ ఓ బిజినెస్‌మేన్‌. తండ్రి కొట్టినప్పుడల్లా బీరువాలో దాక్కుని ఎంజాయ్‌ చేస్తుంటాడు. తండ్రి వ్యాపారంలో మేనేజర్‌ మోసం చేస్తే అతన్ని పట్టుకునేందుకు విజయవాడలో దందాలు చేసే ఆదికేశవులు (ముఖేష్‌రుషి) సాయం కోసం ఇద్దరు అతని ఇంటికి వస్తారు.

అక్కడ ఆయన కుమార్తె స్వాతి(సురభి)ని చూసి ప్రేమించేస్తాడు. ఆ తర్వాత తాము వచ్చిన పని పూర్తయి వెళ్ళిపోతుంటే.. స్వాతి కూడా వారికి తెలీకుండా కారు డిక్కీలో వచ్చేస్తుంది. ఇంతకీ ఆమె ఎందుకు అలా వచ్చింది. సాహసం చేయడానికి కారణం ఏమిటి? అనేది కథ.

నటీనటులు :
సందీప్‌ కిషన్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథే. అయితే గత చిత్రాలన్నింటిలో తను ఎలా చేశాడో ఇందులోనూ అలానే చేశాడు. ఎక్కడా కొత్తదనం కన్పించదు. మాడ్యులేషన్‌, బాడీ లాంగ్వేజ్‌ కూడా అలానే వుంటుంది. సురభి కొత్తమ్మాయి. నటించడానికి పెద్దగా అవకాశం లేకపోయినా వున్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. ముఖేష్‌రుషి పాత్ర చాలా చిత్రాల్లోనూ చూసిందే. సీనియర్‌ నరేష్‌ పాత్రకే నటనకు అవకాశాలు ఎక్కువ. కొడుకు పెట్టే చిత్రహింసలకు మథనపడుతూ, ఆనందపడుతూ పలికించే హావభావాలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ టీవీ నటులే.

టెక్నికల్‌గా... థమన్‌ సంగీతం ఫర్వాలేదు అనిపిస్తుంది. పాటల్లో సాహిత్యం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. రొద ఎక్కువగా వుంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగానే వున్నాయి. సంభాషణల పరంగా కన్మణి ఉపయోగించుకున్న రచయితలు ప్రాస కోసం పాకులాడకుండా.. చక్కగానే రాశారు. తండ్రి తన స్వార్థం కోసం చూస్తుంటాడే కానీ కన్నకూతురులోని ప్రేమను చూడలేకపోతాడు. ఇదే పాయింట్‌ను రెండు గంటల్లో చెప్పాడు.

విశ్లేషణ
కథ ఎప్పుడూ మామూలుగానే వుంటుంది. ప్రజలను భయభ్రాంతుల్ని చేసే విలన్‌. ఒకే ఒక్క కూతురు. ఆమెను తనకిష్టంవచ్చిన వాడితోనే పెండ్లి చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మరొకరిని ప్రేమిస్తుంది. దాని కోసం ఆ కుర్రాడు ఎంతకు తెగించాడు అన్నది కథ. వేల కథలు వచ్చాయి. దాని కోసం మొదటి భాగం సరదాగా చూపించేసి.. సెకండాఫ్‌లో హీరో ఏం చేస్తాడనేది దర్శకుడు చెప్పదలచింది. హీరో విలన్‌ కన్‌ఫ్యూజ్‌ చేస్తూ రకరకాల జిమ్మిక్కులతో సినిమాను తన భుజాలపై వేసుకోవడం ఇప్పటి యూత్‌ హీరోలు చేసేదే. అదే ఫార్ములా సందీప్‌ కిషన్‌ చేశాడు.

కొన్నిచోట్ల పేరున్న దర్శకులు ఫార్మెట్‌ను కూడా వాడుకున్నాడు దర్శకుడు. అయితే బీరువా కాన్సెప్ట్‌ అనేది కొత్తగా అనిపిస్తుంది. మిగతావన్నీ పాత వాసనలే. నవ్వించడానికి ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సప్తగిరి చేసే విన్యాసాలు చిత్రాన్ని కాస్త నిలబెడతాయి. అలాగే షలకల శంకర్‌ వంటవాడి పాత్రగా మెప్పిస్తాడు. వీరిద్దరి పాత్రలు లేకపోతే సినిమా చాలా చప్పగా వుంటుంది.

కాగా, నిర్మాణపరంగా చాలా సింపుల్‌గా ఈ చిత్రాన్ని తీశారు. కేవలం రామోజీ ఫిలింసిటీ లోనే చిత్రాన్నంతా చుట్టేశారు. ఛేజింగ్‌కు సిటీకి రావాలని హైటెక్స్‌ దగ్గర ఫ్లైఓవర్‌ను మాత్రమే వాడుకున్నారు. చాలా సింపుల్‌గా తీసిన ఈ చిత్రం నాలుగు రోజులు ఆడినా సేఫ్‌గా వుంటుందనే నిర్మాణంలో కన్పిస్తుంది. ఇంతకుమించి ఈ చిత్రం గురించి చెప్పాల్సిందేమీలేదు.

''బేబీ''ని అక్కడ బ్యాన్ చేశారు

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'బేబీ'. ఈ రోజు ప్రపంచ వ్యావ్తంగా విడుదలైయింది. అయితే, ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో బ్యాన్ చేశారు. ఇండియన్ మిలటరీ-టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రమిది. దీనిపై పాక్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. ఈ చిత్రంలో ముస్లిింలను దుర్మార్గులుగా చిత్రీకరించారని, నెగెటివ్ క్యారెక్టర్లకు ముస్లిం పేర్లే పెట్టారనే కారణం చూపుతూ చిత్రంపై బ్యాన్ విధించింది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి, తాప్సీ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు.

Thursday, 22 January 2015

మైసూరులో బయల్పడ్డ సొరంగం

బెంగుళూరు: మైసూరులో ఓ సొరంగం బయటపడింది. విశ్వ మానవ పార్కు వద్ద డ్రైనేజీ పనులు చేస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. 150 ఏళ్ళ క్రితం నాటిదిగా భావిస్తున్నారు. ఈ సొరంగం మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు ఉంది. అర కిలోమీటరు పొడవున్న ఈ సొరంగం గన్ హౌజ్ నుంచి మైసూరు ప్యాలెస్‌కు దారి తీస్తుంది.

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడు

ఆ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు పలు కహానీ కబుర్లు చెప్పాడు. ప్రేమించానన్నాడు. ఆ యువతిని నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చివరకు ఫేస్‌బుక్ అక్కౌంట్ క్లోజ్ చేసేశాడు. దీంతో మోసపోయానని భావించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్గావ్‌కు చెందిన రాజన్ మల్హోత్రా అనే 22 సంవత్సరాల యువకుడికి 19 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఓ రోజు నేరుగా ఆ అమ్మాయి ముందు వాలాడు. ప్రేమిస్తున్నానని చెప్పి గుర్గావ్‌లోని హోటల్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ పెళ్లి టాపిక్ వచ్చే సరికి మాట మార్చాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్న రాజన్ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. తనపై రాజన్ అత్యాచారం చేసినా మళ్లీ ఆమె కరిగిపోయింది. చివరకు అక్కడ నుంచి జారుకున్న రాజన్ తన ఫేస్‌బుక్ అక్కౌంట్ క్లోజ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బిజెపిలోకి క్రికెట్ స్టార్

పశ్చిమబెంగాల్ లో బిజెపిని బలపరచడానికి ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పలువురిని తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్న బిజెపికి ఇప్పుడు క్రికెట్ స్టార్ దొరికినట్లే కనబడుతోంది.

మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం.ఆయన బిజెపి అద్యక్షుడు అమిత్ షా ను కలుసుకున్నారని కదనం.2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రముఖుడిగా ఉన్నారు.గతంలో కూడా గంగూలి బిజెపిలో చేరతారని అనుకున్నా చేరలేదు.ఇప్పుడు చేరవచ్చంటున్నారు.

మన్మథుడి మరదలిగా

నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున, అనసూయల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారు. ఓ పాటలో హీరోతో కలిసి అనసూయ స్టెప్పులు వేస్తుంది అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసానందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాల జంపాలా’ నిర్మాత రాధామోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలోబ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

Wednesday, 21 January 2015

ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి...

దుబాయ్: మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి, తనని పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్న శ్రీలంక దేశస్థుడికి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, ఈత శిక్షకుడు(34) అయిన ఆ వ్యక్తి గతంలో సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో ఆమె నగ్న చిత్రాలను అతను తీశాడు. ఇప్పుడు వాటిని చూపించి, తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆ చిత్రాలను కుటుంబసభ్యులకు చూపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు.

అంతేకాక ఆ ఫొటోలను అతను తన మామ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ యువతి సోదరికి కూడా పంపాడు. నిందితుడు డబ్బు కోసం తనను బెదిరించాడని ఆమె కోర్టుకు తెలిపింది.

సెక్స్ సమాచార వేటలో పాక్ ఫస్ట్... గూగుల్ లిస్ట్

గూగుల్ సెర్చ్‌లో సెక్స్ సంబంధిత సమాచారం కోసం గాలింపు చేసే దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు సెక్స్ సమాచారం కోసం సర్చ్ చేసే వారి గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని గూగుల్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ దేశంలో ప్రజలు సెక్స్‌పరంగా ఎదురైయ్యే ఎటువంటి చిన్నసమస్య కైగా పాకిస్థానీయులు గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తున్నతెలిపింది.

బూతు చిత్రాల కోసం వేతుకులాట.. సెక్స్ సంబంధిత విషయాల కోసం సర్చ్ చేసే లిస్ట్‌ను తయారుచేయగా అందులో మొదటి స్థానంలో పాక్ ఉన్నట్లు వెల్లడించింది. ఇక రెండు మూడు స్థానాల్లో ఈజిప్టు, ఇరాన్ దేశాల ప్రజలు ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత స్థానాలలో ఇరాన్, మొరాకో, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఉన్నట్టు వెల్లడించింది.

కాగా లెబనాన్, టర్కీ తప్పించి మిగిలిన అరబ్ దేశాలు అన్ని సెక్స్ సంబంధిత సమాచారాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలకు చెందిన యువత సెక్స్ సంబంధిత విషయాల కోసం ఎక్కువగా గూగుల్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. శృంగారం కోసం గూగుల్ ని ఆశ్రయిస్తున్న దేశాల జాబితాలో మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు ముస్లిం దేశాలే ఉండటం విశేషం.

Tuesday, 20 January 2015

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సన్నీలియోన్

తన అందంతో భారతీయ సినిమా రంగానికి తనవంతు సేవలు అందిస్తున్న సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఆ విషయం తెలిసిన చాలామంది అభిమానులు ఆ లిఫ్ట్ దగ్గర చేరి, దాన్ని కష్టపడి తెరిచి సన్నీ లియోన్ని రక్షించారు. ఆ తర్వాతే వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సమయంలో ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్ కూడా వున్నాడు. 




ముంబైలో మ్యాన్‌డేట్ అనే మ్యాగజైన్‌ను ఆవిష్కరించేందుకు ఓ హోటల్‌కి సన్నీ లియోన్ దంపతులు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. మ్యాన్‌డేట్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద సన్నీ దంపతుల ఫొటోను ప్రచురించారు. ఆ సంచికను ఆవిష్కరించడానికి వచ్చిన సందర్భంగా ఈ సరదా సంఘటన జరిగింది. సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయేసరికి సన్నీ అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారుగానీ, సన్నీ లియోన్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ లిఫ్ట్‌లోంచి బయటకి వచ్చింది.

పెద్దలకు మాత్రమే

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 23వ తేది విడుదల సిద్ధమైన ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్లగా, చిత్రంలోని డైలా‌గ్‌లపై సెన్సార్ బృందం కన్నుపడింది. దీంతో చిత్రంలో ఉన్న పలు వివాదాస్పద డైలాగ్స్‌లను గుర్తించి వాటిలో కొన్నిటిని మ్యూట్ పెట్టి, 11 కట్స్‌ను సెన్సార్ బోర్డు విధించినట్టు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సొంతంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత అనీల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారికాగ కళ్యాణ్ కనిపిస్తాడు. గత కొంత కాలంగా ప్లాఫులతో ఉన్న క్రుంగిపోయిన కల్యాణ్ 'పటాస్' పైనే ఆశలు పెట్టుకున్నారు. అందువల్లనే సినిమా పబ్లిసిటీలో ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించారు. దీంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆదరణ కూడా ఉండవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఇక సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం ఈ చిత్రాన్ని లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా పేర్కొన్నట్టు సమాచారం. కాగా కళ్యాణ్ రామ్ సినీ కెరీర్‌లో భారీ అంచనాల నడుమ, పాజిటివ్ టాక్‌తో విడుదలకానుంది.

అనుమానాస్పద ఫేస్ బుక్

హైదరాబాద్ : ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షణ పొందేందుకు సరియా వెళ్తూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నగరానికి చెందిన సల్మాన్ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. పాతబస్తీలోని హబీబ్‌నగర్‌కు చెందిన సల్మాన్ మోహినుద్దీన్‌కు సిరియాకు చెందిన అయేష అనే యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ఉగ్రవాదం వైపు ఆకర్శించిన విషయం తెలిసిందే.
సల్మాన్ రోజూ అయోషాతో ఫేస్‌బుక్ ద్వారా తరచూ చాటింగ్ చేసేవాడు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యాచరణ, కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు, టెక్ట్స్ ఫైల్స్‌ను షేర్ చేసుకున్నారు. సల్మాన్ తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఉగ్రవాద సంస్థలు నగర యువకులను ఆకర్శించేందుకు యత్నిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు గ్రహించాయి.
ఈ మేరకు నిఘా వర్గాలు నగర పోలీసులతో పాటు ఐబీ ఐటీ, సీఐ సెల్ విభాగాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశాయి. ఉగ్రవాద శిక్షణ సంస్థలున్న సిరియా, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చే ఫేస్‌బుక్ మెసేజ్‌లపై నిఘా పెట్టేందుకు ఐబీ వర్గాలు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన యువతను రెచ్చగొట్టే, ప్రభావితం చేసే, ఆకర్శించే విధంగా నినాదాలు, మతోన్మాదానికి సంబంధించిన వ్యాసాలు, కామెంట్స్, వ్యాఖ్యలను చేరవేసే ఫేస్‌బుక్‌లపై దృష్టి పెట్టనున్నారు. వీరితో పాటు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన ఫేస్‌బుక్‌లు, ఈమెయిల్స్‌పై కూడా ఆరా తీస్తున్నారు.
ఇక ఉగ్రవాద కార్యకలాపాలను ఫేస్‌బుక్‌ద్వారా ప్రచారం చేసే ఏజెంట్లు, నిందితులను గుర్తించి వారి నుంచి వచ్చే ఫేస్‌బుక్ మెసేజ్‌లు, కామెంట్లు, నినాదాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు నిఘా వర్గాలు సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులను రంగంలోకి దింపారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ఐటీ నిపుణుల సహకారం అత్యంత కీలకంగా మారనుంది.

Sunday, 18 January 2015

బస్సులో గోపాలా గోపాలా షో... పట్టుకున్న పోలీసులు

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ జంటగా నటించిన మల్టీస్టారర్ మూవీ గోపాలా గోపాలా సినిమా పైరసీ సీడీలు బయటకు వచ్చేశాయి. సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే సినిమా పైరసీ కాపీలు మార్కెట్లోకి రావడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో గోపాలా గోపాలా పైరసీ సీడీని ప్రయాణికుల కోసం ప్రదర్శిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నల్గొండ జిల్లా కోదాడ వద్ద బస్సు ఆపగా ఈ విషయం వెల్లడైంది. సీడీలను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇలా కొత్త సినిమాల సీడీలను ప్రదర్శిస్తున్న ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు.

తెనాలిలో యువతిపై పొలాల్లో అత్యాచారం

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నమ్మించి ముగ్గురు వ్యక్తులు ఆమెను వేమూరు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారం విషయాన్ని బయటకు చెపితే ఆమె తల్లిని, తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. అయితే ఆమె పోలీసులను ఆశ్రయించి ఆ యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన 20 ఏళ్ల వివాహిత భర్తతో విబేధాల కారణంగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో స్థానిక యువకులైన టి.గోపి, ఎం.ఆనంద్, పి.సుబ్బు ఆమెను మాయమాటలతో నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tuesday, 13 January 2015

మీలో ఎవరు కోటీశ్వరుడు లో నందమూరి హీరో

నాగార్జున టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో ఒక పెద్ద హిట్ కొడుతుంది.ఈ షో కి చిరంజీవి,అమల అక్కినేని,విద్య బాలన్.కాజల్,ఛార్మి,మంచు లక్ష్మి గెస్ట్స్ గా రావడం తో అత్యంత టిఆర్పీ రేటింగ్స్ నమోదు చేసుకుంది.

ఇప్పుడు ఈ షో కి నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ ఒక్కరే కాదు ,కళ్యాణ్ బ్రదర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ ద్వారా ఇందులో పాల్గొంటున్నారు.ఈ షో ద్వారా నాగార్జున కళ్యాణ్ తో మంచి అనుభూతుల్ని పంచుకున్నారు.
కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా జనవరి 23 న రిలీజ్ కోసం ఎహురు చూస్తున్నారు.ఈ గేమ్ షో అత్యంత అధిక టిఆర్పీ రేటింగ్స్ నమోదు చేసుకోబోతుంది.

పెళ్ళికి ముందే ఆ హీరోయిన్ కి...


హాట్ భామ త్రిష కి పెళ్ళికి ముందే 7కోట్ల విలువైన ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడట కాబోయే వరుడు వరుణ్ మణియన్. ఈనెల 23న త్రిష -వరుణ్ మణియన్ ల వివాహ నిశ్చితార్దం జరుగనున్న నేపథ్యంలో తన ప్రేయసికి విలువైన బహుమతి ఇవ్వాలని భావించిన వరుణ్ 7కోట్ల విలువైన కారుని అందించాడని తమిళ మీడియా కోడై కూస్తోంది. వివాహ నిశ్చితార్దం ఓ స్టార్ హోటల్ లో చాలా గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అదే వేదికపై పెళ్లి ఎప్పుడనేది కూడా తెలియజేస్తారట . పెళ్లి తర్వాత సినిమారంగానికి గుడ్ బై చెప్పకుండా దర్శకత్వం వైపు వెళ్ళాలని ఆలోచిస్తోందట ఈ భామ.  

మిగతా More Details Click Here

Monday, 12 January 2015

అన్నంత పనీ చేసిన విద్యాబాలన్

‘డర్టీ పిక్చర్’తో కుర్రకారును హీటెక్కించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా చేసిన ఫొటోషూట్‌లో ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచడం పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రోజుల క్రితం విద్యాబాలన్ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘2015 క్యాలెండర్ కోసం నేను చేయబోయే ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ ఆధ్వర్యంలో ఫొటోషూట్ వార్తల్లో నిలవడం ఖాయం. మీరే చూడండి.. కావాలంటే నేను అన్నంత పనీ జరుగుతుంది’’ అన్నారు.


 అన్నట్టుగానే ఈ ఫొటోషూట్ సంచలనానికి దారితీసింది. ఎందుకంటే, ఒంటి మీద కేవలం వార్తాపత్రికతో పోజులిచ్చారీ బ్యూటీ. ఈ పోజులు చూసినవాళ్లు ‘విద్యా చాలా హాట్ గురూ...’ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.

Sunday, 11 January 2015

'కోర్కెలు తీర్చే దేవుడు వేంకటేశ్వరుడు'

తిరుమల: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం సాయంత్రమే ఆయన తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... 'భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. గతంలో నేను విద్యార్థిగా వచ్చి స్వామి ఆశీస్సులు అందుకున్నా. ఇప్పుడు నా కుటుంబంతో కలసిరావడం గొప్ప అనుభూతి..' అని అఖిలేశ్‌యాదవ్ చెప్పారు.

తనకు విద్యార్థిగా, వీఐపీగా స్వామిని దర్శించుకునే గొప్ప అవకాశం లభించిందన్నారు. ప్రత్యేకించి తమ బంధువులతో కలసిరావడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు.

Saturday, 10 January 2015

కారులో కరెన్సీ కట్టలు

చెన్నై: నిత్యం ఏదో ఒక సంచలన వార్తతో కలకలం రేపుతున్న తమిళనాడులో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన కారులో కట్టలు కట్టల కరెన్సీ బైటపడింది. ఆ సొమ్మును సుమారు రూ.3 కోట్లుగా అంచనావేశారు. ఇది హవాలా సొమ్మా లేక తీవ్రవాదుల కోసం చేరవేస్తున్నదా అనే అనుమానాలు రేకెత్తాయి.రాష్ట్రం గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా తయారైంది. తీవ్రవాదులు, మావోయిస్టుల కదలికలు పోలీస్ శాఖకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఏ వైపు నుంచి ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రతి మనిషిని, ప్రతి వాహనాన్ని సందేహించేంతగా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆదాయపు పన్ను, పోలీసు అధికారులనే కలవరపాటు గురిచేసే స్థాయిలో కరె న్సీ బయటపడింది.

కోయంబత్తూరు సమీపం సేలం-కొచ్చి జాతీయ రహదారిలో పోడిపాళయం అనే గ్రామం వద్ద బుధవారం ఉదయం ఒక ఇన్నోవాకారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీ కొన్నాయి. కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోగా ఆ వాహన డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యూరు. ప్రమాదం కారణంగా కారు తలుపులు తెరుచుకోగా అందులో నుంచి రూ.500 నోట్ల కట్టలు చెల్లాచెదరుగా పడ్డారుు. ఈ కరెన్సీని చూసిన బస్సు డ్రైవర్, ప్రయాణికులు కంగారుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కారును సోదా చేయడం ప్రారంభించారు. కారు తలుపుల్లో, సీటులో స్పాంజికి బదులుగా, లగేజీ పెట్టుకునేచోట కరెన్సీ కట్టలు దొరికాయి. పోలీసులు వెంటనే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కోవై నుంచి అక్కడికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూ.500 నోట్ల కట్టలు 490 ఉన్నట్లు తేలింది. అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం కరెన్సీ విలువ రూ.2.55 కోట్లుగా నిర్ధారించారు. కారులోని ప్రయాణికులను విచారించగా, కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా మాలత్తూరుకు చెందిన జలీల్ (40), కొట్టాయంకు చెందిన జాఫర్, కోళికోట్టైకి చెందిన యాసర్ అబూబకర్ (డ్రైవర్)గా తెలుసుకున్నారు. ఈరోడ్ జిల్లాలో రైల్వే కేటరింగ్ నడుపుతున్న ముస్తఫర్ తమకు ఈ నగదును ఇచ్చి అతని సొంతూరైన మలప్పురం చేర్చాలని చెప్పినట్లు కారులోని క్షతగాత్రులు తెలిపారు. మొత్తం ఎంత నగదు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. వీరిచ్చిన సమాచారంతో నగదు అందజేసిన ముస్తఫా కోసం ఆదాయపు పన్ను అధికారులు ఈరోడ్‌కు బయలుదేరారు.

కరెన్సీకట్టలతో ప్రజల పరుగు
జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన కారులో కరెన్సీకట్టలు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలు రోడ్డుపైకి పరుగులు పెట్టారు. కారు పరిసరాల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న కరెన్సీ కట్టలను కొందరు తమ జేబుల నిండా కుక్కుకున్నారు. మహిళలు తమ పైట కొంగులో వేసుకుని పరుగు లంకించుకున్నారు. మరికొందరు సంచులు తెచ్చుకుని కరెన్సీ కట్టలు నింపుకున్నారు. ఈ సమాచారం పరిసరాలకు పాకడంతో ఆటోల్లో కొందరు అక్కడికి చేరుకున్నారు. అందినంత పుచ్చుకుని ఉడాయించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, అందులోని ప్రయాణికులు చూస్తుండిపోయారు. అధికారులు అక్కడికి చేరుకున్న తరువాత జరిగిన విషయాన్ని కారు ప్రయాణికుడు జలీల్ పోలీసులకు చెప్పాడు.

అధికారులు స్వాధీనం చేసుకున్నది రూ.2.55 కోట్లు కాగా, ప్రజలు ఎత్తుకెళ్లినది కూడా కలుపుకుంటే కనీసం రూ.3 కోట్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని అటవీశాఖ కార్యాలయంపై ఇటీవల మావోయిస్టులు దాడి చేశారు. అలాగే పరిసరాల ప్రభుత్వ కార్యాలయాల్లోని ముఖ్యమైన డాక్యుమెంట్లను ధ్వంసం చేశారు. ఈ కారణంగా సరిహద్దుల్లో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. సరిహద్దులో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇవేమీ పట్టించుకోకుండా ఇంతటి భారీ స్థాయిలో కరెన్సీని తరలించడం పోలీసుశాఖను ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్రవాదుల కోసం చేరవేస్తున్న నగదుగా అనుమానిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ యాసర్ ప్రాణాలతో పోరాడుతుండగా, మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

చెన్నై బ్యూటీ నిశ్చితార్థం... బహుమానం ధర రూ. 7 కోట్లు


చెన్నై సుందరి త్రిషకు ప్రియుడు వరుణ్ మణితో పెళ్లి కుదిరింది. ఇందులో భాగంగా ఈనెల 23వతేదీన త్రిషకు నిశ్చితార్థం జరుగనుంది. వివాహం మాత్రం మార్చి నెలలో ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో ఈ అమ్మడు ట్విట్టర్ ఇన్‌బాక్స్ అంతా అభినందనలతో నిండిపోయింది.

అయితే, తన పెళ్లి తేదీ గురించి ఎలాంటి ప్రచారం చేయవద్దని, ఇంకా తాము తేదీ ఖరారు చేయలేదని చెప్పింది. వివాహం ఎప్పుడనేది తానే స్వయంగా చెబుతానని త్రిష అభిమానులనుద్దేశించి పేర్కొంది. అలాగే, నిశ్చితార్థం కూడా ఓ ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

అదేసమయంలో వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని, త్వరలో రెండు సినిమాలను ఒప్పుకోనున్నానని వివరించింది. ఈ యేడాది నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి కాబోయే వరుడు వరుణ్ మణి నిశ్చితార్థానికి బహుమానంగా ఏకంగా ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఒక కారును ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం త్రిష గోప్యంగా ఉంచింది.

కాగా కొంతకాలంగా వరుణ్ మణియన్‌కు, తనకు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవం కాదని ఖండిస్తూ వచ్చిన త్రిష ఇపుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం గమనార్హం.

More News Click Here

Friday, 9 January 2015

చెత్తలో పేలుడు

మహారాష్ట్రలోని ఓ పవన విద్యుత్ ప్లాంటులో చెత్త తగలబెడుతుండగా అందులో ఉన్న జిలెటిస్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో్ నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారాలో చోటుచేసుకుంది.

ఉదయం 10 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ప్లాంటు ప్రాంగణంలో ఉన్న చెత్తను మండిస్తుండగా అందులోని జిలెటిన్ స్టిక్స్ పేలి ప్రమాదం సంభవించిందని సతారా ఎస్పీ ఎ. దేశ్ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను సమీపంలోని సితార ఆస్పత్రికి తరలించామన్నారు.

కరీనా కపూర్‌కు వీహెచ్‌పీ సలహా : కోర్టులో దావా వేసుకోమని!



బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు విశ్వహిందూ పరిషత్ నేతలు ఓ ఉచిత సలహా ఇచ్చారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే మహిళా మ్యాగజైన్ కవర్ పేజీపై కరీనా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడం వివాదం కావడంతో ఈ సలహా ఇచ్చారు.


ముద్రించే హిమాలయ వాహిని మ్యాగజైన్‌ కవర్ పేజీపై కరీనా కపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్‌పీ సమర్థించుకుంది. 'ఈ విషయంలో ఏదైనా సమస్య ఉందని నటి కరీనా కపూర్ భావిస్తే, కోర్టు తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి' అని వీహచ్‌పీ నేత ప్రకాష్ శర్మ హితవు పలికారు.

'లవ్ జిహాద్' అంటూ హిందూ యువతులను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని మతం మార్చుకునేలా కొందరు ముస్లింలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, తాజా సంచికలో ముఖ చిత్రంగా కరీనాను చూపింది. కరీనా కపూర్ వివాహం సైఫ్ అలీ ఖాన్‌తో జరుగగా, ఆపై కరీనా తన పేరును కరీనా కపూర్ ఖాన్‌గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ముఖ చిత్రంలో కరీనా సగం ముఖంపై బురఖా ఉన్నట్టు చూపారు. దాని కింద 'ధర్మాందరన్ సే రాష్ట్రాంతరన్' అని కాప్షన్ ఇచ్చారు. దీనిపై కరీనా మాత్రం ఇంకా స్పందించలేదు.

*** for More Updates Click Here

2015లో ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి..?

భారతీయ కుటుంబాలలో జరిగే అన్ని ముఖ్యమైన శుభకార్యాలు వారి యొక్క జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడి జరుగుతాయి.

2015లో ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి..?,

Astrology, Horoscope, Psychic Reading, Love Psychics, Love life, Matrimony, Separation, Financial & Job 

వీటి గురించి తెల్సుకోవాలంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి కొన్ని సింపుల్ ప్రశ్నలకి సమాధానాలు పంపి రిజిస్టర్ చేసుకోండి , ఆ తరువాత ఈమెయిల్ కి వచ్చిన వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే ప్రతిరోజూ మీ జాతక, ఆస్ట్రాలజీ మొ॥ తెల్సుకొవచ్చు. 



ప్రస్తుతం ఈ సౌలభ్యం కేవలం భారతీయ నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతర్జాతీయ నగరాలకు ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది.

Thursday, 8 January 2015

ముంబై మీద మళ్లీ ఉగ్రదాడులు?

కాన్ బెర్రా : ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశం నుంచి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికగా తెలిపింది. ముంబై నగరంలోని కొన్ని ప్రధానమైన హోటళ్ల మీద ఈ దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, శ్రీనగర్ నగరాలతో పాటు.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి అయితే అసలు వెళ్లొద్దని తమ దేశ ప్రయాణికులకు ఆస్ట్రేలియా చెప్పింది. ఈ విషయం స్మార్ట్ ట్రావెలర్.జీఓవి.ఏయూ అనే వెబ్ సైట్ లో స్పష్టంగా ఉంది.

ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రమాదం ఉన్నందున, వాహనాల ప్రమాదాల రేటు కూడా ఎక్కువగా ఉండటం వల్ల భారత దేశానికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు భారతదేశంపై దాడులు చేస్తారన్న సమాచారం తమకు తరచుగా వస్తోందని, అందువల్ల ఆస్ట్రేలియన్లు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు. ముఖ్యంగా భారతదేశానికి సరొగసీ కోసం వెళ్లే ఆస్ట్రేలియన్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Wednesday, 7 January 2015

ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న బరాక్ ఒబామా కుమార్తె ఫోటో


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె 16 సంవత్సరాల మలియా ఒబామా ఫొటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుండటం ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఆమె బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించిన మలియా పోని టెయిల్ హెయిర్‌తో నేరుగా ఫోజిచ్చినట్లు ఆ ఫోటోను చూస్తే అర్థమవుతుంది.
                             
    అయితే ఈ ఫొటో ఎవరు, ఎక్కడ తీశారు అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అసలు సదరు ఫొటోను ఇంటర్నెట్‌లో ఎవరు పెట్టారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ వివాదంపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు.

కరెంటుతీగతో ఎన్టీఆర్ ...?


టాలీవుడ్ లో లక్కీగాళ్ గా పేరుతెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోంది. ప్రస్తుతం ఒకవైపు రవితేజ, మరోవైపు రామ్ లతో సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంపికైంది. ఈ విషయం తెలియగానే ఆమె ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొన్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన చాలామంది హీరోయిన్లు చేసేశారు. దాంతో ఈసారి ఇప్పటివరకు అసలు చేయని, అందమైన హీరోయిన్ కోసం సుకుమార్ వెతికారని, సరిగ్గా అలాంటి కోవలోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరిందని ఈ సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో హీరోయిన్ కు కూడా మంచి నటనకు అవకాశం ఉండటంతో ఆమెకు ఇది మంచి చాన్సు అవుతుందంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ రవితేజ సరసన వస్తున్న కిక్-2లో నటిస్తోంది. వాళ్లిద్దరికి చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు.
1 BHK book only at Rs=30,000/- Click Here to Enquire!

Popular Posts