బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో సంచలనం అని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం నాని హోస్టింగ్ తో మొదలైన ఈ రెండో సీజన్ ఇప్పుడు ఓ కొలిక్కి రాబోతున్నది. 16 మందితో మొదలైన ఈ సీజన్ మొత్తం 5 మందితో చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి అందరూ కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనేది కౌశల్ అభిమానుల వాదన.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కి ముందు ఎలిమినేట్ అయినటువంటి సభ్యులని అందరిని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ సర్ప్రైజ్ ఒక్కరికి తప్ప అందరికి దక్కింది. తిరిగి వచ్చిన సభ్యులు అందరూ మళ్ళీ కౌశల్ నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో వారే మళ్ళీ గ్రూపులుగా విడిపోయి కౌశల్ ని ఒంటరి చేశారు. తేజస్వి అయితే మరీను వచ్చి అందరిని పలకరించింది కానీ, ఒక్క కౌశల్ ని మాత్రం పట్టించుకోలేదు.
బాబు గోగినేని పరిస్థితి కూడా ఇంతే వారు ఏ విధంగా ఐతే బయటికి వెళ్లారో అదే విధంగా లోపలికి వచ్చారని,వాళ్ళు ఇక మారరని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నా సరే కౌశల్ ని ఒక్కరు కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు,సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.కానీ కౌశల్ కి తాము ఎప్పుడు వెన్నంటే ఉంటామని కౌశల్ ఆర్మీ అంటున్నారు.