తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు జిల్లా కేంద్రంలోని అనేక వీడియో షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇప్పటికే లింగ చిత్రానికి సంబంధించిన 60 వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న పలు కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క లింగ చిత్రమే కాక, ప్రతి సినిమాకి విడుదలైన మరుక్షణమే వినుకొండలో పైరసీ సీడీని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారయ్యే పైరసీ సీడీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు