జబర్దస్త్ కామెడీ షో బయట కూడా దుమారం రేపుతోంది. గౌడ విద్యార్థి సంఘం కార్యకర్తలు టీవీ ఆర్టిస్టు వేణుపై దాడి చేయడంతో జబర్దస్త్ టీమ్ వీధికెక్కింది. సోమవారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. తెలుగు ప్రజలను నవ్వించేందుకు ఎంతో కష్టపడుతున్న కమెడియన్లపై దాడి చేసి వారితో కంటతడి పెట్టించడం సంప్రదాయం కాదని నటుడు, జబర్దస్త్ జడ్జి నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జబర్దస్త్ సభ్యుడు వేణుపై, గౌడసంఘం నేతలు ఆదివారం దాడిచేసిన విషయం తెలిసిందే. వేణుపై జరిగిన దాడికి నిరసనగా సినీ, టీవీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్ చాంబర్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జబర్దస్త్ టీంతో పాటు ఇతర ఆర్టిస్టులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ప్రజలను నవ్వించడమే తమ ధ్యేయమని, వ్యక్తిగతంగా ఎవరినీ తాము విమర్శించబోమని, వేణుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాగబాబు చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే, క్షమాపణలు కోరేందుకు తమకు ఎలాంటి అభ్యతరం లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆయన అన్నారు.
మిగతా Read more : Click Here
మిగతా Read more : Click Here