Saturday, 20 December 2014

మిస్‌ ఇండియా 2014గా USA తెలుగమ్మాయి!

న్యూ జెర్సీ, డిసెంబర్‌ 18: న్యూజెర్సీలోని రాయల్‌ అల్బర్ట్స్‌లో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో తెలుగు యువతి ప్రణతి గంగరాజు మిస్‌ ఇండియా యుఎస్‌ఎ-2014 కిరీటాన్ని దక్కించుకుంది. 19 ఏళ్ళ వయసులోనే మిస్‌ ఇండియా యుఎస్‌ విజేతగా నిలిచిన వ్యక్తిగానే కాక, 20 ఏళ్ల తరువాత మళ్ళీ మిస్‌ ఇండియా యుఎస్‌ఎ విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి ప్రణతి.

అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన ఈ అందాల పోటీల వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు ధర్మాత్మ శరణ్‌ అధ్యక్షతన పీజెంట్‌ సంస్థ 33వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్‌ ఇండియా యుఎస్‌గా నిలిచిన ప్రణతి తల్లి మైత్రేయి గంగరాజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు, తండ్రి రామ్‌ గంగరాజు ఏ.పీ లోని విజయవాడకు చెందినవారు.

More Details: Click Here

Popular Posts