Thursday, 11 December 2014

లింగ సినిమా టిక్కెట్ ఖరీదు 12,000 లా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగ' విశ్వవ్యాప్తంగా హంగామా సృష్టిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తం ఏకంగా 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

‘లింగ’ సినిమాకు దేశ విదేశాల్లో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే.. ఇండియన్ ట్రేడ్ పండిట్స్ మతులు పోతున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాక.. మిగతా రాష్ట్రాల్లో.. విదేశాల్లో ‘లింగ’ ఫీవర్‌తో పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు.

తమిళనాడులో ఏ సినిమా విడుదల కానన్ని స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. చెన్నైలోని ఓ థియేటర్‌లో తొలి టికెట్ కోసం వేలం వెయ్యగా ఓ అభిమాని రూ.12 వేలు పెట్టి టికెట్ కొన్నాడంటే ఇక చూసుకోండి 'రింగ' ఎంత రేంజ్‌లో ఉంటుందో.

చెన్నైలో 50 థియేటర్లలో సినిమా ఆడుతుంటే. ఇప్పటిదాకా మరే తమిళ సినిమాకు ఇన్ని థియేటర్లలో ఆడకపోడం విశేషం. తమిళనాడులో కంటే రెట్టింపు థియేటర్లలో తెలుగులో విడుదలవుతోంది లింగ. మరోవైపు కేరళలో ఏకంగా 225 థియేటర్లలో ‘లింగ’ హంగామా చేస్తోంది.

దేశంలోనే కాదు విదేశాల్లో చూస్తే.. ఒక్క అమెరికాలో మాత్రమే 330 స్క్రీన్స్‌లో లింగ విడులవుతుంటే.. ఓ ఇండియన్ మూవీకి ఇంత హంగామా అని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. యూఏఈలోనూ 60 థియేటర్లలో ‘లింగ’ వేస్తున్నారు.

సినిమా విడుదల శుక్రవారమే అయినా.. ముందురోజే విదేశాల్లో భారీగా ప్రిమియర్ షోలు వేస్తున్నారు. మరో వైపు వేలం పాట ద్వారా టికెట్లు అమ్ముతూ భారీ మొత్తం దోచుకుంటున్నారు.

Popular Posts