AK-47 ఈ రైఫిల్‌ను ఉత్పత్తి చేస్తున్న ఓ రష్యా ఆయుధ సంస్థ... ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలో అతి ఎక్కువ మందిని పొట్టన బెట్టుకున్న మారణాయుధంగా ప్రాముఖ్యత పొందిన AK - 47ది ఒక ప్రత్యేక చరిత్ర.
మారణాయుధాల్లో ఏకే-47ది ప్రత్యేక స్థానం. ప్రపంచంలో ఇప్పటివరకూ 10 కోట్ల ఏకే -47లు తయారయ్యాయి. వీటి కారణంగా ఏటా సుమారు పాతిక లక్షల మంది మరణిస్తారని అంచనా. అందుకే దీన్ని కనిపెట్టినందుకు మిఖాయిల్ కలష్నికోవ్ చాలా ఆవేదన చెందేవాడని చెబుతారు.
ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కలష్నికోవ్ రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడకుంటే కలష్నికోవ్ రూపుదిద్దుకునేదే కాదు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన కలష్నికోవ్.. ఆసుపత్రిలో ఉండగా, కలష్నికోవ్‌ను డిజైన్ చేశాడు. గత ఏడాది మరణించేవరకూ కలష్నికోవ్ తాను కనిపెట్టిన ఏకే-47 దుర్వినియోగమవుతోందని వాపోయేవాడు.
ప్రస్తుతం ఏకే-47ను సైబీరియాలోని కలష్నికోవ్ కన్సర్న్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఏకే-47పై వరల్డ్ ట్రేడ్ మార్క్ హక్కులు తమకే కావాలని కలష్నికోవ్ కన్సర్న్ దరఖాస్తు చేసుకొంది. కేవలం రైఫిల్ మీదే కాకుండా... బొమ్మలు, క్రీడాపరికరాలు, జిమ్నాస్టిక్ పరికరాలకు కూడా తమ అనుమతి లేకుండా ఏకే-47 అన్న పేరును ఉపయోగించుకోరాదని ఈ సంస్థ వాదించింది.
ఏకే -47 పేరుతో రష్యాలో కాక్‌టెయిల్ కూడా విక్రయిస్తున్నారు. మొజాంబిక్, మరొకొన్ని దేశాల జాతీయ పతాకంపై ఏకే-47 కనిపిస్తుంది. ఏకే-47 వెర్షన్‌ను మెరుగుపరచినా, ఏకే-47 వాడకంలో సౌలభ్యం దృష్ట్యా మిగతా వెర్షన్స్ అంత హిట్ కాలేదు. ఇటీవలే మన దేశంలో గుజరాత్‌లో ఏకే-47 ప్లాంట్‌ను నెలకొల్పాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కలష్నికోవ్ కన్సర్న్ సంస్థకు ఏకే - 47 ట్రేడ్ మార్క్ దక్కితే... ఆ పేరును ఉపయోగించుకునే ప్రతి ఉత్పత్తీ మీదా ఆ సంస్థకు రాయల్టీ చెల్సించాల్సిందే. అదే జరిగితే... ఏకే-47 పేరుకున్న డిమాండ్ దృష్ట్యా, కేవలం రాయల్టీల రూపంలోనే ఆ సంస్థకు మిలియన్ల రూబుళ్ల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.