Posts

చిరంజీవి కొత్త సినిమా!

చిరు రాజకీయ అజ్నాని. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగా తెలియదు. సమస్యలపై అవగాహనా తక్కువే. ఇలా భావించేవాళ్లంతా ఇక చిరు పట్ల ఇక తమ ద్రుక్పథాన్ని మార్చుకోవాలేమో. ఎందుకంటే ఇక నుంచి చిరు సరిగ్గా మాట్లాడే అవకాశముంది. రాజకీయంగానూ సరైన అడుగులు వేసేలా కనిపిస్తున్నాడు. కారణం..  చిరు కొత్తగా నియమించుకున్న రాజకీయ గురువే. అతడే పీసీసీ పీఠాధిపతి బొత్స. ఇంతకుముందు కేవలం రాజకీయ సలహాదారుగా మాత్రమే పనిచేసిన సత్తిబాబు ఇప్పడు పూర్తిస్థాయి గురువు బాధ్యతలను స్వీకరించినట్టు సమాచారం. ఇక నుంచి మెగాస్టారు సత్తిబాబు చెప్పినట్టే  నడుచుకుంటాడట. అలాగని అతడు బొత్స అడుగులకు మడుగులు ఎత్తుతాడని చెప్పి చిరు అభిమానులను నొప్పించను  కానీ పరస్పర ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఒకరికొకరు పూర్తి స్థాయిలో సహకరించుటకైతే ఒక అంగీకారం కుదిరినదట. ఇక ఎప్పడు బొత్స మీట నొక్కితే అప్పడే  చిరు స్వరం ఢిల్లీలో గానీ.. హైదరాబాదులో గానీ వినిపించును. భగవంతునికి, భక్తునికి అనుసంధానం టైపులో ఇక బొత్సకు, చిరుకు మధ్య ఎవరూ లేకపోయినా అప్పడప్పడు ఆ అనుసంధానపు బాధ్యతలను ఘంటా శ్రీనివాసు నిర్వహించునని తెలుస్తున్నది. ప్రజారాజ్యం పోయి....

ఈ పదాలకు పల్స్ రేట్ లేదు!

నా దగ్గర దేహం ఉంది నీ దగ్గర జీవం ఉందా? వద్దొద్దు..కంగారు పడకు నాకు తెలుసు నీ దగ్గర ఏమీ లేదని. నువ్వూ నాలాంటి వాడివేనని.అయినా మనం భయపడాల్సిన పనేమీలేదు ఎందుకంటే మన దగ్గర దోచుకొనేదేమీ లేదు కాబట్టి రకరకాల విబజన రేకల్లో కోతకు గురయ్యాక మనిషి దగ్గర ఇంకేం మిగులుతుంది?కల్లు కరువు దేసాల్లా సిధిలమైపోయాయి. కన్నీళ్ళు మైళ్ళ లోతుల్లో ఇంకిపోయాయి.లైఫ్ ఈజ్ ఎ బ్రాండ్.నువ్వూ నేనూ ఈ భూమ్మేద టెంపరరీ కస్టమర్స్.జేబులో సొమ్మయిపోగానే మొహం మీదే షట్టర్ మూసేస్తారు.నీలో సరుకు అయిపోయిందా,ప్రపంచం ఇరుకైపోతుంది.గుర్తుంచుకో,చిర సుపరిచిత ప్రపంచంలో  అపరిచితులం మనం.లైఫ్ను పేస్లుగా ఎడిట్ చేస్తే లేయర్స్ లోపల నవ్వుల్లేవ్ పువ్వుల్లేవ్,ప్రెమల్లేవ్.ఎవ్రిథింగ్ డిస్కనెచ్టెడ్ సోకాల్డ్ సివిలైజేషన్. నరాలు తెగినట్టు,వెన్నెముక విరిగినట్టు,గుండె జారినట్టు,నెత్తురు ఆవిరీయినట్టు ప్రెషర్ కుక్కర్లో ఉడికీ ఉడికీ కెంద్ర నాడీ వ్యవస్త కుప్పకూలుతున్న ఇండికేషన్స్.టో మెనీ కాంప్లికేషన్స్.

పొలిటికల్(నో కామెంట్స్!)

పొలిటికల్(నో కామెంట్స్!) ఎన్ని విగ్రహాలు పగలగొడితే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది? ఎంత పెద్ద సునామీ వస్తే ఈ రాజకీయనాయకులందరూ కొట్టుకుపోతారు? ఒక కొత్త పార్టీ పెడితే ఎన్ని లక్షల కోట్లు దోచుకోవచ్చు? ఎన్ని తిట్లు తిడితే రాజకీయనాయకులకు బుద్ది వస్తుంది? ఎన్ని దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వం దిగివస్తుంది? ఎంత అవినీతి సొమ్ము సంపాదిస్తే మంచి పేరు వస్తుంది? ఒక పార్టీని మరొక పార్టీలో కలిపితే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? ఒక రాజకీయనాయకునిపై పోలీసు కేసు పెట్టాలంటే ఎంత పెద్ద సాక్ష్యం కావాలి? ఎంత పెద్ద విద్వంసం చేస్తే అది ఒక ఉద్యమం అవుతుంది?

మాటలనుండి మౌనంలోకి

మాటలనుండి మౌనంలోకి ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా అదో దిగులు.ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు.ఇప్పుడు కాస్త అర్దమవుతుంది ఈ దిగులు. "ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదని.కొత్త రోజు రింగవుతుంది.అంతా ప్రీపెయిడ్.కాలం కస్టమర్ కేర్ లా గైడ్ చేస్తుంది.బైటకి వెళ్ళాలంటే బండి ఆటో స్టార్ట్ ప్రెస్ చేయండి.ప్రమోషన్ రావాలంటే కంప్యూటర్ కీబోర్డ్ అరిగేదాకా ప్రెస్ చెయండి.ఇంటికి వచ్చేముందు ఏ.టి.యం. నెంబర్ ప్రెస్ చెయండి.ప్రెస్,ప్రెస్,ప్రెస్ ఒత్తిడి.తిరిగి హోం మెనూ లోకి రావాలంటే అంతా గజీ,బిజీ.ఈ వత్తిడిలో డ్రాఫ్ట్ నుండి నీ కాల్ వస్తుంది.మైండ్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూనే తర్వాత మాట్లాడతా. ఓపిగ్గా నీ మాటలు వినాలని,చెప్పాలనిపించి నా మనసు కార్డ్ స్క్రాచ్ చెసి చూస్తే అన్నీ లెక్కతప్పిన అంకెలే. ముందుంచు బూతులు మైనస్లో పడి కలవరపెడతాయి.నా గతం కాల్ డైవర్ట్ అయి ఇప్పటి వరకూ ఎలా గడిచిందీ కాలం? ఇప్పుడేంటిలా ఏదో పనిలో ఉండగా సెల్ వైబ్రేషన్ లా వళ్ళంతా పాకి ఉలిక్కిపడుతున్నాను.ఎంటో చెప్పు సెల్ని చెవికప్పగించి కంప్యూటర్ లోనుంచి తలతిప్పకుండా నీ లోకంలోకి 'ఎంటర్ ' అయేందుకు విశ్వప్రయత్నం ...

ఫిబ్రవరి దేవుడు!

ఫిబ్రవరి దేవుడు దేవుడు ఒకసారి మన భూమిమీదకి రావాలనుకున్నాడు.దేవుడంటే మన అందరి దిక్కూ మొక్కూ అయిన ఆ దేవుడే.అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాడు. ముందుగా మన భారతదేశంలో పర్యటించాలనుకున్నాడు.పెద్ద రాష్ట్రాలయితే రెండు రోజులు,చిన్న రాష్ట్రాలయితే ఒక్క రోజు చొప్పున షెడ్యూల్ ఉంది.ఈ విషయం రహస్యం అయితే ఎవరూ తనను పట్టించుకోరని ముందుగా మీడియా వాళ్ళందరికీ ఈ విషయం లీక్ చేశాడు.మీడియా వాళ్ళు ఈ విషయం గంటకోసారి చొప్పున 24 గంటలూ టాం.టాం. వేశేశారు. ఫిబ్రవరి 1.అందరూ ఎదురుచూస్తున్నారు ఆ రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది.ముందుగా ఆంద్రప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు.అడిగిన వారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నాడు.ఒకాయన మారుతీ 800 కారు అడిగి తీసుకెళ్ళాడు,ఇది తెలిసి వాళ్ళావిడ అతన్ని నానా తిట్లు తిట్టి అంతటి దేవుడు వరాలు ఇస్తుంటే ఏ టాటా ఇన్నోవా కారో అడక్క ఇది ఎందుకు తెచ్చారు?అని తిట్టిపోసింది.ఈ ముత్యాలహారం ఏంచేసుకోను? సాక్షాత్తూ ఆ దేవుడే దిగి వచ్చి మనకు వరాలు ఇస్తుంటే ఏ వజ్రాల హారమో అడక్క ఇది ఎందుకు తెచ్చారు? అని వాళ్ళాయన్ని ఉతికి ఆరేసింది. ఇలా అసంత్రుప్తితో ఉన్న జనం అంతా తరువాతరోజు దేవుడు వెళ్ళేచోటుకి ముందుగానే చేరుకుంటున...

ఆకాశంలో నా ఊహలు

ఆకాశంలో నా ఊహలు అబ్బ ఊహల ఊయల ఎంత బాగుంటుందోకదూ?ఒక్క సారి ఊహల ఊయల ఊగేద్దామమరి? కంది పప్పు కిలో రెండు రూపాయలు.బియ్యం కూడా కిలో రెండు రూపాయాలకే దొరుకుతున్నాయట. కూరగాయలైతే కిలొ అర్ద రూపాయి దాటి లేదు.బంగారం తులం మీద వంద రూపాయలకే వస్తుందట. ఇళ్ళ స్తలాలు కూడా గజం వంద రూపాయలేకేనట.అపార్ట్మెంట్ల బాగోతం పోయి అంతా ఇందిపెండెంత్ ఇళ్ళు కట్టుకుని పెరటిలో కూరలూ,వీధి వైపు స్తలంలో పూల మొక్కలు కనువిందు చేస్తూ ఆహ్లాదంగా వున్నాయి.రైతులకి పంటలన్నీ విపరీతంగా పండి ఎంతో ఆనందంగా ఉన్నారు.ప్రతినిత్యం సంక్రాంతి లానే ఉంది. ప్రతి మనిషీ మోసం మాయ ఏదీ లేక,ఏ గొడవలూ లేకుండా ఎంతో సక్యతగా సంతోషంగా ఉన్నారు. ఇక తిరుపతిలో క్యూ అనేది లేదట.వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్లుగానే దర్శనం చేసుకొని బయటకు వఛేయటమే. లడ్డూలు అడిగినవారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నారు.భక్తులు ఆనందంతో తన్మయత్వం చెందుతున్నారు. ఆహా ఏమి ప్రజల అద్రుష్టం.రాజకీయనాయకులు కూడా మామూలుగా మాదిరి ఇళ్ళలో ఉండి వారికి ఉన్న ఆస్తులన్నీ బీదవారికి పంచి ఇచ్చి ప్రజల మనసులో దైవాల మాదిరి కొలొపించుకుంటున్నారు.అవును ఇదంతా నా ఊహా చిత్రమే!

మా కళ్ళింకా పేలిపోలేదేం?

మా కళ్ళింకా పేలిపోలేదేం? గుడ్లగూబకీ పావురాయికీ ఒకసారి తగాదా వచిందట.నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయట. మీరెంత మంది అంటే మీరెంత మందీ అనుకున్నాయట.తేల్చుకుందాం రా అనుకొని కొండ దిగువున వున్న మైదా నంలో అడవి అంచున వారం తరువాత కలుద్దామని అపాయింట్మెంట్ పెట్టుకున్నాయట. ఆ రోజు రానే వఛింది.గుడ్లగూబలు తండోపతండాలుగా వఛి చెట్లపై వాలాయి.తగాదా పెట్టుకున్న పావురాయి మౌనంగా చూస్తూ కూర్చుంది.లెక్క పెట్టుకుంటావా,ఓటమి ఒప్పుకుంటావా అని అడిగిందిప్రత్యర్ది గుడ్లగూబ దాన్ని. ఒక్క నిముషం ఆగు అంది పావురాయి. నిజంగా ఒక్క నిముషం గడిచిందో లేదో ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది.తూర్పునుంచి,పడమర నుంచి,ఉత్తరం నుంచి,దక్షినం నుంచి వందల కొద్దీ పావురాలు.రెక్కలు టప టపా కొట్టుకుంటూ ఎగిరొఛాయి.వఛి కొండ పైనుంచి క్రింది దాకా,మైదాన మంతా నిండిపోయి నిలిచున్నాయి.ఇంకా వస్తూనే ఉన్నట్లు శబ్దం వస్తూనే ఉంది. గుడ్ల గూబలు అలా చూస్తూనే ఉండి పోయాయి. అదిగో అప్పటినుండే వాటి కనుగుడ్లు అలా పెద్దవైపోయాయి. ............ నమ్మ శక్యంగా లేదు కదూ! నిజమే పావురాల చేతిలో చిన్న ఓటమికే అవి శశ్వితంగా అంత పెద్ద కనుగుడ్లు వేసుకుని ...