Monday, 29 October 2018

1200 స్క్రీన్స్ లో సర్కార్

ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్. మురగదాస్-విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సర్కార్ గతంలో వీరి కాబినేషన్ లో తుపాకీ, కత్తి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
దాదాపు ఈ సినిమాని 1200 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కోలీవుడ్ లో సర్కార్ 83 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, తెలుగు రైట్స్, ఇతర రైట్స్ తో కలిపితే సర్కార్ విడుదలకి ముందే వంద కోట్లు రాబట్టిందని చెప్పొచ్చు.

మరోవైపు, ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ఈ సినిమా కథ నాదే అంటూ రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మురుగదాస్‌.. అందులో ఏమాత్రం నిజం లేదు. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు ? అన్న నేపథ్యంలో ఉంటాయి. నా కథలో వివిధ అంశాలని లోతుగా ప్రస్తావించామని తెలిపారు

Sunday, 28 October 2018

Wednesday, 24 October 2018

అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ ఆఫర్ - మాస్టర్ లింక్

అమెజాన్ ఆఫర్ - మాస్టర్ లింక్ : https://bit.ly/2JhUKnS

ఫ్లిప్ కార్ట్  ఆఫర్ - మాస్టర్ లింక్ : https://bit.ly/2JgvvlF

Must Buy: Large Appliances : https://bit.ly/2Pg1pnX

Monday, 22 October 2018

ఫ్లిప్-కార్ట్ FlipKart Auspicious Furniture Store సేల్


Furniture & Mattresses upto 70% off.

Debit & Credit Cards – 5% off upto Rs. 750 on Purchase of Rs. 3000+: Only on products sold by OmniTechRetail. An instant discount will be awarded at the time of making the payment. Payment Options > Credit / Debit / ATM Card > Enter Card Details.

మరోసారి త్రిష అకౌంట్ హ్యాక్ అయ్యింది


హీరోయిన్ త్రిష ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకున్నది. ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నారని, తన పేరుతో పోస్ట్ అయిన మెసేజ్ లను పట్టించుకోవద్దు అని, ఫ్యాన్స్ ఎవరూ రిప్లై ఇవ్వొద్దని ఆమె కోరింది. గతంలో త్రిష అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. త్రిష ప్రస్తుతం రజనీకాంత్ సరసన పెటా సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె కొన్ని రోజులుగా వారణాసిలో ఉంటుంది.
Trisha Account Hacked
Trisha Account Hacked

Friday, 12 October 2018

గూగుల్ ని ఊపేస్తున్న అరవింద డైలాగ్స్

తెలుగులో మాటల మాంత్రికుడు మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. తన సినిమాల్లో కేవలం మాటలతోనే మ్యాజిక్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే త్రివిక్రమ్ మరోసారి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ నోట నుంచి వస్తుంటే థియేటర్ మొత్తం హోరెత్తిపోతుంది.

Today's Best Offer:
Up to 50% off on Furo Sports shoes


ఈ సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పలికిన సంభాషణలు ఆలోచించేలా ఉన్నాయి. దాంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
=> వినే టైము.. చెప్పే మ‌నిషి వ‌ల్ల‌.. విష‌యం విలువే మారిపోతుంది.వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు.. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.
=> జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్క‌డా ఆగిపోక‌డ‌దు.
=> నన్ను న‌మ్మిన‌వాళ్ళ‌కు అప్పుడూ ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉంటాను.
=>  ఆలోచించే వాడికంటే.. ఆలోచింపచేసే వాడే గొప్పోడు.
=> చావు చొక్కా లేకుండా తిరగాడుతున్నట్లుంది
=> నేను ఊరికే అడిగానండి.. నేను ఊరికే చెప్పనండి.
=> నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది.
=>  గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.
=>  సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.
=> ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి.
=>  సార్ వందడుగుల్లో నీరు పడుతుందంటే.. 99 అడుగులు వరకు తవ్వి ఆపేసేవాడ్ని ఏమంటారు.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాను.. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్.. తవ్వి చూడండి.
=> 30 ఏండ్ల నాడు మీ తాత కత్తిపట్టినాడంటే.. అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే.. అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం, చివ‌రికి ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.

=> ఇవండీ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ పేల్చిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్.. ఇప్పుడీ డైలాగ్స్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రాల్ అవుతున్నాయి.

Monday, 8 October 2018

అంతసేపు ఎన్టీఆర్ మౌనమేనా?

ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్, డైలాగ్స్ అంటేనే ఎన్టీఆర్. అయన స్క్రీన్ పై అల గలగలా మాట్లాడుతుంటే అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక అటువంటి హీరోకు ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దొరికితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలే డైలాగులు రాయడంతో త్రివిక్రమ్ దిట్ట. వాటిని చెప్పడంతో ఎన్టీఆర్ దిట్ట. ఈ ఇద్దరు కలిస్తే రాచ్చరచ్చే. ఇప్పటికే ట్రైలర్ డైలాగ్స్ రచ్చ చేస్తున్నాయి.
ఇక సినిమాలో ఎలా ఉంటాయో అనే అంచనాలు పెరిగిపోయాయి కూడా. ఇప్పుడు అరవింద సమేత లో మరో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో తోలి అరగంట ఎన్టీఆర్ కు మాటలు ఉండవని, మరీ అవసరం అయినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడని చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అసలు ఎన్టీఆర్ లాంటి హీరోను తోలి అరగంట మాటల్లెకుండా ఉంచడం అంటే మాములు విషయం కాదు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నాడు

Sunday, 7 October 2018

సంచలనాత్మక సెలబ్రిటీగా ఇలియానా

ileana as sensational celebrity
ileana as sensational celebrity
సినీనటి ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఇండియన్ సైబర్ స్పేస్ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ మొదటి స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇలియనా ఆక్రమించుకుంది. అమెరికన్ క్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ MCA free నిర్వహించిన (అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ) సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్స్ ని మభ్యపెట్టి తప్పుడు వెబ్ సైట్స్ క్లిక్ చేసేందుకు ఇలియానా పేరుని ఎక్కువగా యూజ్ చేశారని ఈ సర్వే లో తేలింది. ఈ జాబితాలో ఇలియానా తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలు ఉన్నారు.

Friday, 5 October 2018

MLA ఎమ్మెల్యే అందాల విందు

ఎలాగైనా పరిశ్రమలో పాతుకుపోవాలని, ఇక్కడే స్టార్ అయిపోవాలని కలలు కంటుంది కేథరిన్. స్వతహాగా రిచ్ అయిన ఈ పాపకు సినిమా అంటే పిచ్చి. అందుకే తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుంటుంది. ఇప్పటికే బన్నీ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. స్టార్స్ ఇప్పటికీ ఆమెను పట్టించుకోవడం లేదు.

దాంతో అందాలే పెట్టుబడిగా దూసుకెళ్తుంది. గతేడాది విడుదలైన గౌతమ్ నందాలో గ్లామర్ షో అంతా ఈ భామే తీసుకుంది. ఏకంగా బికినీ కూడా వేసింది. కేథరిన్ బికినీ సీన్ వేడి పుట్టించేలా రూపొందించాడు సంపత్ నంది. ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్ అవడంతో ఎవరు పట్టించుకోలేదు. ఆ సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనేసింది.
Catherine Tresa Show Off
ఏదో టైం పాస్ కోసం సినిమాలు తప్పా...ఆమెకు ఆస్తులకు కొదవలేదు. ఎప్పటికైనా సోలో హీరోయిన్ రోల్స్ వస్తాయనే ఆశతో ఉన్నది. ఇక ఇప్పుడు హాట్ ఫోటో షూట్ ఒకటి చేసి తను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తు చేసింది. ఆమె కెరీర్ గాడిన పడాలంటే కేథరిన్ ఆప్షన్ అందాల అరబోతనే. మరి చూడాలి ఈ అందాలైన కేథరిన్ ను కాపాడుతుందో లేదో.

Thursday, 4 October 2018

ఆ హీరోయిన్ కి ప్రభాస్ ఎవరో తెలియదట

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు నటుడిగానే కాకుండా టీవీ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్, దస్ కా దమ్ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ పై రూపొందించిన సినిమా లవ్ యాత్రి.
వరీన్ హుస్సేన్, అయుష్ శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 5 న విడుదల కానున్నది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో, హీరోయిన్ అయుష్ శర్మ , వరీన్ హుస్సేన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలతో మీడియాతో పంచుకున్నారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ సినిమాలు చూస్తారా అని హీరోయిన్ వరీన్ హుస్సేన్ ని ఓ విలేకరి అడిగాడు.

అయితే టాలీవుడ్ సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ, బాహుబలి సినిమా చూశానని చెప్పింది. అయితే ప్రభాస్ మీకు బాగా నచ్చాడా....ప్రభాస్ నటన ఎలా ఉంది అన్న ప్రశ్నకు అమ్మడు తెల్లముఖం వేసింది. అసలు విషయం ఏమిటంటే....ప్రభాస్ అంటే ఎవరో వరీన్ హుస్సేన్ కు తెలియదట.

Popular Posts