Saturday, 22 November 2025

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

sbi-ibomma

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా "ఐ బొమ్మ " వెబ్‌సైట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెబ్ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ ను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచగా.. ఈ పైరసీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రవిని అరెస్ట్ చేసిన వెంటనే వెబ్ సైట్ ని బ్లాక్ చేసేశారు అధికారులు. కానీ ఐబొమ్మ తరహా లోనే మరో కొత్త వెబ్‌సైట్ తెరపైకి రావడం అది డైరెక్ట్ గా కొత్త సినిమాలను కూడా ప్రదర్శిస్తుండడం ఆందోళన రేకెత్తించింది. 'ఐబొమ్మ వన్' పేరుతో వచ్చిన ఆ వెబ్ సైట్.. మూవీరూల్జ్ వెబ్ సైట్ కి అది రీ డైరెక్ట్ అవుతూ సినిమాలను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి సరిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది.

SBI పోర్టల్‌కు లింక్.. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లో నుంచి పైరసీ సినిమాలను చూసేందుకు SBI పోర్టల్‌కు లింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకింగ్ వెబ్‌సైట్ వంటి అత్యంత రక్షణ గల ప్లాట్‌ఫాంలోకి పైరసీ లింక్‌ను చొప్పించడం వెనుక పైరసీ రాకెట్ ఎంత పెద్దదో అనే అనుమానాలను లేవనెత్తుతోంది. SBI term life insurance పోర్ట‌ల్‌కు ఐబొమ్మను లింక్ చేశారు. దీంతో ఐబొమ్మకు సంబంధించిన బప్పమ్ టీవీలో లింక్ కాపీ చేసి SBI term life insurance పోర్టల్‌లో పేస్ట్ చేస్తూ సినిమాలు చూస్తున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా బ్యాంకు వెబ్ సైట్ నే హ్యాక్ చేసి దానికి లింక్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇది sbi పోర్టల్ కాదని ఫేక్ sbi పొట్రాల క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారని అంటున్నారు.


ఈ విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచార‌ణ‌లో భాగంగా SBI టెక్నిక‌ల్ టీం నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐబొమ్మ లింక్ తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రవి పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే ఇలా జరగటంతో రవి వెనక ఎవరెవరున్నారు. ఐబొమ్మను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా తాను ఎన్నడూ పట్టుబడనని.. అతి పెద్ద ప్రభుత్వ వెబ్‌సైట్లనైనా హ్యాక్ చేయగలనని రవి గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. 


కాగా రవి 2019 నుంచి ఈయన భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను చట్టవిరుద్ధంగా అప్‌లోడ్ చేస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రూ.3,000 కోట్లకు పైగా నష్టం కలిగించారని పోలీసులు వెల్లడించారు. కొన్ని నెలలుగా తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఎదుర్కొంటున్నాడు. విడాకులు కోసం విదేశంలో ఉన్న రవి ఇటీవల ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమాచారాన్ని రవితో విభేదాలు ఉన్న భార్య స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. రవి నగరానికి చేరుకున్న వెంటనే, ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే అత్త, భార్యాల అవమానాల కారణంగానే డబ్బు సంపాదన కోసం వెబ్ సైట్ క్రియేట్ చేసి సినిమాలు అప్లోడ్ చేసినట్టు రవి అంగీకరించారు.

Thursday, 9 May 2024

హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?

 హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్‌ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు


ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది

Saturday, 4 May 2024

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!



ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌ లోనుంచి బాటిల్‌ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం  చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌ లోనుంచి బాటిల్‌ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం  చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్‌ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.


      ఎందుకంటే రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.

అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.


      రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్‌ వాటర్‌ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.

Monday, 4 March 2019

సానియా మీర్జాపై మ‌ళ్లీ నెటిజ‌న్ల ఫైర్‌.. ఎందుకంటే..?

సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ ను పాకిస్థాన్ ఆర్మీ ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. వాఘా సరిహ‌ద్దు వ‌ర‌కు అభినంద‌న్‌ను పాక్ ఆర్మీ ర‌హ‌దారి మార్గంలో త‌ర‌లించి స‌రిహ‌ద్దు వ‌ద్ద భారత సైన్యానికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో అభినంద‌న్ రాక‌పై యావ‌త్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ముక్త కంఠంతో జైహింద్ అని కొనియాడారు. అలాగే ఇండియ‌న్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభినంద‌న్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

‘వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌కు స్వాగ‌తం. నువ్వు మా నిజ‌మైన హీరోవి. మీరు చూపిన తెగువ‌, ధైర్య సాహసాల‌కు యావ‌త్ దేశం మీకు శాల్యూట్ చేస్తుంది. మ‌రోసారి అభినంద‌న్‌కు స్వాగ‌తం చెబుతున్నా. జై హింద్‌..!’ అంటూ.. సానియా ట్వీట్ చేసింది. అయితే సానియా ట్వీట్‌కు అటు పాకిస్థానీయుల‌తోపాటు భార‌త ప్ర‌జలు కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆగ్ర‌హాన్ని వారు ట్విట్ట‌ర్ లో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. సానియా పెట్టిన ట్వీట్‌పై వారు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

‘నీకు నిజ‌మైన హీరో ఎవ‌రో ఇప్పుడు తెలిసిందా..’ అని కొంద‌రు సానియా ట్వీట్‌ను విమర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు.. ‘నువ్వు నిజ‌మైన హీరోను ఇప్ప‌టి వ‌ర‌కు చూసుండ‌వు..’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభినంద‌న్ పాక్ ఆర్మీ అదుపులో ఉన్న‌ప్పుడు కూడా సానియా చేసిన ట్వీట్‌పై దుమారం చెల‌రేగిన విష‌యం విదిత‌మే. మ‌రోవైపు ఆమె భ‌ర్త, పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ మాత్రం త‌మ దేశ ఆర్మీకి అనుకూలంగా గ‌తంలో కామెంట్లు చేశాడు. అందువ‌ల్లే.. భార‌త పౌరులు సానియా ట్వీట్ల‌పై మండిప‌డుతున్నారు.

Sunday, 17 February 2019

ఎన్టీఆర్ ని ఎందుకు వదిలేశారో

2017, 2018 సంవత్సరం కు గాను సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డు ప్రకటించారు. ఆనవాయితీ ప్రకారం, హీరోలు, హీరోయిన్లు అందరికి ఏదో ఓ పేరు చెప్పి అవార్డులు ఇచ్చేశారు. ఆ జాబితాలో లేని హీరో అంటూ లేడు. ఒక్క ఎన్టీఆర్ తప్ప. ఎన్టీఆర్ కావాలనుకుంటే అరవింద సామెత వీరరాఘవ సినిమాకి గాను, అవార్డు ఇవ్వొచ్చు. కానీ, కే. సుబ్బిరామిరెడ్డి ఎన్టీఆర్ ని విస్మరించారు.

దీనికి కారణం అంటూ ఏమి లేదు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు ఖాతాలో నందమూరి బాలకృష్ణకు అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఇస్తే బాలయ్య ఆ వేడుకకి వస్తాడో, రాడో అన్నది సుబ్బిరామిరెడ్డి అనుమానం. అందుకే, ఆ రిస్క్ చేయలేకపోయాడు కెఎస్ఆర్. బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం ఇటీవలే తగ్గినట్లు అనిపించింది. ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు ఫంక్ష‌న్‌ని జూనియ‌ర్ వ‌చ్చి వెళ్లాడు.

అంత‌కు ముందు అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ లో బాల‌య్య అతిథిగా మెరిశాడు. ఈ తాజా ప‌రిణామ‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం తగ్గింద‌నుకున్నారంతా. కానీ… అది అలానే కొన‌సాగుతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ రిస్కు తీసుకోవ‌డం ఇష్టం లేక‌.. బాల‌య్య కోసం ఎన్టీఆర్‌ని వ‌ద్ద‌నుకున్నాడు కేటీఆర్‌. అందుకే సుబ్బిరామిరెడ్డి అవార్డుల జాబితాలో ఎన్టీఆర్ పేరు క‌నిపించ‌లేదు.

Monday, 11 February 2019

క్లివేజ్ షో తో మతిపోగొడుతున్న ఐశ్వర్య

అందం గురించి ఉదాహరణ చూపించాలంటే ఐశ్వర్యారాయ్ ను చూపిస్తే సరిపోతుంది. అంతగా ఇప్పటికీ తన అందంతో అలరిస్తుంది ఈ భామ. 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా బ్రహ్మదేవుడు మాత్రం ఈమెకు ఒక్కదానికే అందాలను దాచుకునే యంత్రం ఎదో ఇచ్చినట్లున్నాడు. అందుకే ఇప్పటివరకు గ్లామర్ షోతో మతులు పోగొడుతుంది.

తాజాగా డబూ రత్నాని ఫ్తో షూట్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐశ్వర్యారాయ్. అక్కడ ఆమెను చూసి ఫిదా కానీ వారు ఉండరు. కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..?

మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ డ్ర‌స్ లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది. ఇప్పుడు కూడా అమ్మడి అందాల ఆరబోత చూసి ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. ఆమె క్లివేజ్ తో అక్కడి కెమెరాలన్నీ వేడెక్కాయి

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా?

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకుంటే పెళ్లి కాదా? అని హీరోయిన్ శ్రీయ ప్రశ్నిస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించబోనని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తానూ ఆదినుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలను వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా ఆవులారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆమధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని చెప్పింది.

మొదట ఆ కమర్షియల్ ప్రకటనలో నటించాలని తననే సంప్రందించారని, దాన్ని తానూ తిరస్కరించానని చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ.... సదరు క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకపోతె కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబందించిన విషయం. స్వతహాగానే అది వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదూ. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నా నేను ఒప్పుకోను అని తేల్చేసింది.

Popular Posts