Posts

కౌశల్ ని ఇంకా టార్గెట్ చేస్తున్నారు, తేజస్వి మరాదా?

Image
బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో సంచలనం అని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం నాని హోస్టింగ్ తో మొదలైన ఈ రెండో సీజన్ ఇప్పుడు ఓ కొలిక్కి రాబోతున్నది. 16 మందితో మొదలైన ఈ సీజన్ మొత్తం 5 మందితో చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి అందరూ కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారనేది కౌశల్ అభిమానుల వాదన. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ విషయం నిజమేనేమో అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కి ముందు ఎలిమినేట్ అయినటువంటి సభ్యులని అందరిని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ సర్ప్రైజ్ ఒక్కరికి తప్ప అందరికి దక్కింది. తిరిగి వచ్చిన సభ్యులు అందరూ మళ్ళీ కౌశల్ నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో వారే మళ్ళీ గ్రూపులుగా విడిపోయి కౌశల్ ని ఒంటరి చేశారు. తేజస్వి అయితే మరీను వచ్చి అందరిని పలకరించింది కానీ, ఒక్క కౌశల్ ని మాత్రం పట్టించుకోలేదు. బాబు గోగినేని పరిస్థితి కూడా ఇంతే వారు ఏ విధంగా ఐతే బయటికి వెళ్లారో అదే విధంగా లోపలికి వచ్చారని,వాళ్ళు ఇక మారరని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నిన్నటి ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నా సరే కౌశల్ ని ఒక్కరు కూడా కనీసం పలకరించ...

బిగ్ బాస్ నుంచి మరో లీక్

Image
నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ వారమే బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరు అనేది తెలిపోనున్నది. విజేతగా ఎవరు నిలుస్తారు అనే దానిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతుంది. మొదటి నుంచి బిగ్ బాస్ లో జరగబోయే ఎలిమినేషన్స్ ముందుగానే తెలిసిపోతున్నాయి. ఇప్పుడు అదే జరిగింది. ఈరోజు జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో దీప్తి బయటకు వేల్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన ఓట్ల ద్వారా ఈ విషయం చెబుతున్నారు. కౌశల్, గీత, సామ్రాట్, తనిష్ ఈ నలుగురిలో ఫైనల్ వీక్ జరనుంది. వీరిలో ఇద్దరిని శనివారం ఎలిమినేట్ చేయనున్నారు. ఇక ఆఖరి ఎపిసోడ్ ఆదివారం రోజున మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు.

ట్విట్టర్ లో కాజోల్ ఫోన్ నెంబర్

Image
పొరపాటున ట్విట్టర్ లో తన భార్య, నటి కాజోల్ మొబైల్ నెంబర్ ని షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అంతే నిమిషాల వ్యవదిలో ఆ ట్విట్టర్ వైరల్ అయింది. వేలమంది ఈ ట్విట్ ని వాచ్ చేశారు, వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటుని గమనించిన అజయ్ దేవగన్ ఫ్రాంక్ అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్సాప్ లో మెసేజ్ లపై మెసేజ్ లు చేస్తున్నారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. అజయ్ దేవగన్ ఏమని ట్విట్ చేశాడంటే....కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు....ఆమెను వాట్స్ యాప్ నెంబర్ సంప్రదించి సమన్వయం చేసుకోండి అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ అందరికి కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు. Kajol Whatsapp Number Leaked in Twitter

ఈ ఒక్క ఫోజులో చాలానే సంగతులున్నాయి

Image
బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ లేటెస్ట్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. సన్నీ ఈ ఫోటోలో నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది. బ్లాక్ కలర్ జీన్స్ బాటమ్ – దానికి కాంబినేషన్ గా కాఫీ రంగు టైట్ ఫిట్ టాప్… పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ కలర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగతులున్నాయి. దీనికి ప్రఖ్యాత కార్ల్ టన్ లండన్ ఇండియా – ఐరా సన్ గ్లాసెస్ – స్ప్లాష్ యాక్సెసరీస్ – స్ప్లాష్ టాప్ ఇన్ని రకాల బ్రాండ్లు సన్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులనే తన మేకప్కి ఉపయోగిస్తోంది. హితేంద్ర కపోపర ఈ స్టైల్ ని డిజైన్ చేశారు. కపిల్ కిల్ నాని ఈ ఫోటో రూపకర్త.

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

Image
గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది. Radhika Apte "రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు." అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక. "రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన ...

సమంత దెయ్యం అంటున్న చైతు

Image
అదేంటి సమంతను చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా.... అలా అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.... పరిశ్రమలో ఏ ఇద్దరినీ కదిపినా కూడా అక్కినేని వారి పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరూ వచ్చి సెప్టెంబర్ 13న తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. శైలజ రెడ్డి అల్లుడు వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న వస్తుంది. అయితే తన సినిమాను విడుదల చేయాలనే కంగారులో భార్య సమంతనే మరిచిపోయాడు నాగచైతన్య. అయితే ఆ తర్వాత మెల్లగా సమంతకు వెళ్లి తన సినిమా విషయం చెప్పాడు చైతన్య. అప్పుడు నిజంగానే యుటర్న్ సినిమాలో దెయ్యంలాగే పేస్ పెట్టిందని.... తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే నువ్వొచ్చి నా సినిమాపైనే పెడతావా అంటూ అరిచేసిందని చెప్పాడు చైతు. అయితే ఇద్దరు డిఫరెంట్ సినిమాలు చేశారు.... రెండు విభిన్నమైన కాన్సెప్ట్ లు... పైగా వినాయకచవితి సెలవులు ఉన్నాయి కాబట్టి సమస్య లేదని డిస్ట్రిబ్యూటర్లు తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నాడు చైతు.

పడి పడి లేచే మనసు

Image
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా నటిస్తున్న సినిమా 'పడి పడి లేచే మనసు ' . ఈ సినిమా లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది .ఈ చిత్ర యూనిట్ ఇటీవల నేపాల్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా వీరు హైదరాబాద్ చేసుకొని ఇక్కడ షూటింగ్ ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం వీరు రొమాంటిక్ సీన్స్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమా లో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ని చిత్ర యూనిట్ డిసెంబర్ 21 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు .