Monday, 23 February 2015

'తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!

* తెలుగు రచయితల మహాసభల్లో భాషాభిమానుల పిలుపు
* మన భాషకు గౌరవం లేనప్పుడు జీవితానికి అర్థంలేదని వ్యాఖ్య
* న్యాయస్థానాల్లోనూ తెలుగులో పాలన జరగాలి
* మన రచనలు తెలుగుకే పరిమితం కాకూడదు
* ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు


విజయవాడ:   ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వెలుగులీనాలని, ప్రతి తెలుగువాడూ మాతృభాషకు సేవ చేసేలా చైతన్యం పురివిప్పాలని, తెలుగు భాషాభిమానులు, పలువురు ప్రముఖులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పిలుపునిచ్చారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న ఈ మహాసభల ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు భాషకు సొబగులద్దిన అతిరథ మహారథులతోపాటు వివిధ రంగాల్లో తెలుగుకు సేవచేస్తున్న ప్రముఖులూ హాజరై తెలుగు ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ సాహిత్య, లలిత కళలు, సంగీత సంస్థ(అకాడమీ)లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల్లో తెలుగుకు ప్రాధాన్యత గురించి పెద్దలతో చర్చిస్తామని తెలిపారు.

Popular Posts