Sunday, 15 February 2015

సచిన్ పై తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా క్రికెటర్లు నిత్యం వివాదాలను గొడవలను కోరుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ మరోసారి మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సచిన్ పై విమర్శలకు దిగాడు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో సచిన్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వివరాలిలా ఉన్నాయి.

టీమిండియాకు గతంలో కోచ్‌గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం చేసుకున్న చాపెల్.. సచిన్‌ను తాను బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన రావాలని కోరగా, తొలుత అంగీకరించాడని తెలిపారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడని, బ్యాటింగ్ స్థానం మార్చుకునేదిలేదని తెగేసి చెప్పాడని చాపెల్ వెల్లడించాడు.

ఇటీవలే విడుదలైన తన జీవితచరిత్ర 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్... చాపెల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. చాపెల్‌ను ఓ 'రింగ్ మాస్టర్' అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Popular Posts