Wednesday, 11 February 2015

విందు వివాదంపై స్పందించిన రామ్ చరణ్

విందు వివాదంపై సినీ హీరో రామ్ చరణ్ స్పందించారు. శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే చేశామని, చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగించినట్టు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయని వివరణ ఇచ్చారు. ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాగ్రతకు భంగం కలింగించేలా ప్రవర్తించనని రామ్ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. పక్కింటివారికి అసౌకర్యం కలిగించినట్టు వచ్చిన వార్తలు అసత్యమని రామ్ చరణ్ కొట్టిపారేశారు.

రామ్‌చరణ్‌ జూబ్లీహిల్స్ రోడ్ నం.25లోని తన నివాసంలో శనివారం రాత్రి స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కొడుకు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. వీరి అరుపులు, కేకలతో స్థానికులకు చికాకు కలిగించారు. రామ్ చారణ్ ఇంటి పక్కనే నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Popular Posts