Thursday 19 February 2015

ఎపి తాత్కాలిక రాజధాని పై పునరాలోచన???

ఎపి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం భవనాలు నిర్మించాలని ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే ఇప్పుడు పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. దీనికి మూడు వందల కోట్లు ఖర్చు చేయడానికి కూడా రంగం సిద్దం అయింది. మళ్లీ అంతలో ఏమైందో కాని, దీనిపై మరో ఆలోచన జరుగుతోంది. తాత్కాలిక నిర్మాణాలకు ఇంత మొత్తం ఖర్చు పెట్టినా అంత ఉపయోగం ఉండదని అబిప్రాయపడుతున్నారు.దానికన్నా 800 కోట్లతో శాశ్వత రాజధాని బవనాలు నిర్మించి ,అప్పుడే బదలాయింపు చేస్తే డబ్బు వృదా కాకుండా ఉంటుందని భావిస్తున్నారు.రాజదానికి లక్ష కోట్ల వ్యయం అవుతుందని , అందులో కీలక భవనాలకు ఇరవైవేల కోట్ల ఖర్చు అవుతుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 800 కోట్ల దగ్గరకు వచ్చినట్లు అనుకోవాలి. ఇది ఒక రకంగా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రజాధనం వృదా కాకుండా ఉంటుందని చెప్పాలి.ఒక వేళ ఆఫీస్ లు అక్కడకు మార్చాలని అనుకున్న ప్రస్తుతం ఉన్న భవనాలను వాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప , వందల కోట్లు ఖర్చు చేసి,మళ్లీ అవన్ని రెండు,మూడేళ్లలోనే ఉపయోగపడకుండా పోవడం మంచిది కాదు. ఇప్పుడు ఎపి ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది.

Blog Archive