Monday, 28 February 2011

మాటలనుండి మౌనంలోకి

మాటలనుండి మౌనంలోకి
ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా అదో దిగులు.ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు.ఇప్పుడు కాస్త అర్దమవుతుంది ఈ దిగులు.
"ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదని.కొత్త రోజు రింగవుతుంది.అంతా ప్రీపెయిడ్.కాలం కస్టమర్ కేర్ లా గైడ్ చేస్తుంది.బైటకి వెళ్ళాలంటే బండి ఆటో స్టార్ట్ ప్రెస్ చేయండి.ప్రమోషన్ రావాలంటే కంప్యూటర్ కీబోర్డ్ అరిగేదాకా ప్రెస్ చెయండి.ఇంటికి వచ్చేముందు ఏ.టి.యం. నెంబర్ ప్రెస్ చెయండి.ప్రెస్,ప్రెస్,ప్రెస్ ఒత్తిడి.తిరిగి హోం మెనూ లోకి రావాలంటే అంతా గజీ,బిజీ.ఈ వత్తిడిలో డ్రాఫ్ట్ నుండి నీ కాల్ వస్తుంది.మైండ్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూనే తర్వాత మాట్లాడతా.
ఓపిగ్గా నీ మాటలు వినాలని,చెప్పాలనిపించి నా మనసు కార్డ్ స్క్రాచ్ చెసి చూస్తే అన్నీ లెక్కతప్పిన అంకెలే. ముందుంచు బూతులు మైనస్లో పడి కలవరపెడతాయి.నా గతం కాల్ డైవర్ట్ అయి ఇప్పటి వరకూ ఎలా గడిచిందీ కాలం?
ఇప్పుడేంటిలా ఏదో పనిలో ఉండగా సెల్ వైబ్రేషన్ లా వళ్ళంతా పాకి ఉలిక్కిపడుతున్నాను.ఎంటో చెప్పు సెల్ని చెవికప్పగించి కంప్యూటర్ లోనుంచి తలతిప్పకుండా నీ లోకంలోకి 'ఎంటర్ ' అయేందుకు విశ్వప్రయత్నం చెసాను.బుజానికీ,చెవికీ మద్య చిక్కుకున్న సెల్ లోనుంచి నీ మాటలు పాదరసంలా జారిపోతాయి.
నీ జ్ఞాపకాలన్నీ ఓ సారి డౌన్ లోడ్ చేసి చూసుకుందా మనుకుంటా! లైఫ్ లైన్లన్నీ గజీ బిజీ అయిపోయి గతం ఎప్పుడూ ఎంగేజ్ వస్తుంది.
నీ మౌనంతో మాట్లాడలని ఉంది.ప్రతి సెకనూ నీ జ్ఞాపకాలకోసం 'పే' చేయాలని ఉంది.
మనసువిప్పి నీతో గంటలకొద్దీ మాట్లాడలని వుంది.కానీ 'స్విచ్ ఆఫ్'.

ఫిబ్రవరి దేవుడు!


ఫిబ్రవరి దేవుడు


దేవుడు ఒకసారి మన భూమిమీదకి రావాలనుకున్నాడు.దేవుడంటే మన అందరి దిక్కూ మొక్కూ అయిన ఆ దేవుడే.అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాడు.
ముందుగా మన భారతదేశంలో పర్యటించాలనుకున్నాడు.పెద్ద రాష్ట్రాలయితే రెండు రోజులు,చిన్న రాష్ట్రాలయితే ఒక్క రోజు చొప్పున షెడ్యూల్ ఉంది.ఈ విషయం రహస్యం అయితే ఎవరూ తనను పట్టించుకోరని ముందుగా మీడియా వాళ్ళందరికీ ఈ విషయం లీక్ చేశాడు.మీడియా వాళ్ళు ఈ విషయం గంటకోసారి చొప్పున 24 గంటలూ టాం.టాం. వేశేశారు.
ఫిబ్రవరి 1.అందరూ ఎదురుచూస్తున్నారు ఆ రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది.ముందుగా ఆంద్రప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు.అడిగిన వారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నాడు.ఒకాయన మారుతీ 800 కారు అడిగి తీసుకెళ్ళాడు,ఇది తెలిసి వాళ్ళావిడ అతన్ని నానా తిట్లు తిట్టి అంతటి దేవుడు వరాలు ఇస్తుంటే ఏ టాటా ఇన్నోవా కారో అడక్క ఇది ఎందుకు తెచ్చారు?అని తిట్టిపోసింది.ఈ ముత్యాలహారం ఏంచేసుకోను? సాక్షాత్తూ ఆ దేవుడే దిగి వచ్చి మనకు వరాలు ఇస్తుంటే ఏ వజ్రాల హారమో అడక్క ఇది ఎందుకు తెచ్చారు? అని వాళ్ళాయన్ని ఉతికి ఆరేసింది.
ఇలా అసంత్రుప్తితో ఉన్న జనం అంతా తరువాతరోజు దేవుడు వెళ్ళేచోటుకి ముందుగానే చేరుకుంటున్నారు.చివరికి ఈ అసంత్రుప్తి సెగలు దేవున్ని కూడా వదల్లేదు.ఇలా దేవుడు ఎక్కడకు వెళ్ళినా అక్కడ మామూలు జనం కంటే అసంత్రుప్తులే ఎక్కువగా ఉంటున్నారు.దేవుడు తనకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు తనని తాను తిట్టుకున్నాడు.

ఫిబ్రవరి 28,చివరి రోజు డిల్లీ పర్యటన.ఈ విషయం తెలిసి మన నాయకులందరూ ప్రదానమంత్రి పదవీ,ముఖ్యమంత్రి పదవి,ప్రత్యేక రాష్ట్రం అడగటం కోసం అక్కడకు వెళ్ళారు.ఇది తెలిసి దేవుడు వాళ్ళున్న ప్రదేశం దగ్గరకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు.
నెలకు 30 రోజులున్న అన్ని నెలలు వదిలేసి 28 రోజులున్న ఫిబ్రవరి నెలను ఎంచుకున్నందుకు దేవున్ని అందరూ తిట్టుకున్నారు.
హమ్మయ్యా!వచ్చినపని అయిపోయిందనుకుని దేవుడు మాయమైపోయాడు.కానీ ప్రజల మనస్సులలోనే కొలువై వున్నాడు.
అందరూ వెతుకుతునే వున్నారు దేవుడి కోసం.

Monday, 14 February 2011

ఆకాశంలో నా ఊహలు


ఆకాశంలో నా ఊహలు

అబ్బ ఊహల ఊయల ఎంత బాగుంటుందోకదూ?ఒక్క సారి ఊహల ఊయల ఊగేద్దామమరి?

కంది పప్పు కిలో రెండు రూపాయలు.బియ్యం కూడా కిలో రెండు రూపాయాలకే దొరుకుతున్నాయట.
కూరగాయలైతే కిలొ అర్ద రూపాయి దాటి లేదు.బంగారం తులం మీద వంద రూపాయలకే వస్తుందట.


ఇళ్ళ స్తలాలు కూడా గజం వంద రూపాయలేకేనట.అపార్ట్మెంట్ల బాగోతం పోయి
అంతా ఇందిపెండెంత్ ఇళ్ళు కట్టుకుని పెరటిలో కూరలూ,వీధి వైపు స్తలంలో పూల మొక్కలు కనువిందు చేస్తూ
ఆహ్లాదంగా వున్నాయి.రైతులకి పంటలన్నీ విపరీతంగా పండి ఎంతో ఆనందంగా ఉన్నారు.ప్రతినిత్యం సంక్రాంతి
లానే ఉంది.

ప్రతి మనిషీ మోసం మాయ ఏదీ లేక,ఏ గొడవలూ లేకుండా ఎంతో సక్యతగా సంతోషంగా ఉన్నారు.

ఇక తిరుపతిలో క్యూ అనేది లేదట.వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్లుగానే దర్శనం చేసుకొని బయటకు వఛేయటమే.
లడ్డూలు అడిగినవారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నారు.భక్తులు ఆనందంతో తన్మయత్వం చెందుతున్నారు.
ఆహా ఏమి ప్రజల అద్రుష్టం.రాజకీయనాయకులు కూడా మామూలుగా మాదిరి ఇళ్ళలో ఉండి వారికి ఉన్న ఆస్తులన్నీ బీదవారికి పంచి ఇచ్చి
ప్రజల మనసులో దైవాల మాదిరి కొలొపించుకుంటున్నారు.అవును ఇదంతా నా ఊహా చిత్రమే!

మా కళ్ళింకా పేలిపోలేదేం?


మా కళ్ళింకా పేలిపోలేదేం?

గుడ్లగూబకీ పావురాయికీ ఒకసారి తగాదా వచిందట.నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయట.
మీరెంత మంది అంటే మీరెంత మందీ అనుకున్నాయట.తేల్చుకుందాం రా అనుకొని కొండ దిగువున వున్న
మైదా నంలో అడవి అంచున వారం తరువాత కలుద్దామని అపాయింట్మెంట్ పెట్టుకున్నాయట.
ఆ రోజు రానే వఛింది.గుడ్లగూబలు తండోపతండాలుగా వఛి చెట్లపై వాలాయి.తగాదా పెట్టుకున్న పావురాయి మౌనంగా చూస్తూ
కూర్చుంది.లెక్క పెట్టుకుంటావా,ఓటమి ఒప్పుకుంటావా అని అడిగిందిప్రత్యర్ది గుడ్లగూబ దాన్ని.

ఒక్క నిముషం ఆగు అంది పావురాయి.
నిజంగా ఒక్క నిముషం గడిచిందో లేదో ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది.తూర్పునుంచి,పడమర నుంచి,ఉత్తరం నుంచి,దక్షినం నుంచి వందల
కొద్దీ పావురాలు.రెక్కలు టప టపా కొట్టుకుంటూ ఎగిరొఛాయి.వఛి కొండ పైనుంచి క్రింది దాకా,మైదాన మంతా నిండిపోయి నిలిచున్నాయి.ఇంకా వస్తూనే ఉన్నట్లు శబ్దం వస్తూనే ఉంది.
గుడ్ల గూబలు అలా చూస్తూనే ఉండి పోయాయి.
అదిగో అప్పటినుండే వాటి కనుగుడ్లు అలా పెద్దవైపోయాయి.
............
నమ్మ శక్యంగా లేదు కదూ!
నిజమే పావురాల చేతిలో చిన్న ఓటమికే అవి శశ్వితంగా అంత పెద్ద కనుగుడ్లు వేసుకుని తిరుగుతున్నాయంటే
నేటి రాజకీయాలు చూస్తున్న మామూలు జనం ఎంత పెద్ద కనుగుడ్లు వెసుకొని తిరగాలి?

జోడీ నంబర్ 'X'


జోడీ నంబర్ 'X'

ఇవ్వాళ పొద్దున ఆ ప్రశ్న చూసినప్పటినుండి అతనికి మహా ఆనందంగా ఉంది.అలాంటి ప్రశ్నలు తన గురించి కూడా ఎవరైనా అడక్కూడదూ! ఎన్నాళ్ళనుండో కాచుకొని కూర్చున్నాడు అడిగితే చెబుదామని.
తనకీ తన మొహానికీ మ్యాచ్ కావడంలేదని అతను ఏ నాడో డిసైడైపోయాడు.కానీ మా ఇద్దరికీ జోడీ కుదిరిందా అని ఇన్నెళ్ళలో ఒక్కళ్ళుకూడా అడగలేదు.అడిగితే దానిమీద ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే కుదరదనే సమాదానం ఎక్కువమంది నుంచి వస్తే దాన్ని మార్చటానికి ఎవరో ఒకరు ఈపాటికే ముందుకు వచ్చే
వారే!
తనకీ తన మార్కులకీ కూడా ఏ ఏడాదీ మ్యాచ్ అవలేదు.ఆ ప్రశ్న ఎవరైనా అడిగి ఉంటే జనం తన ఆన్సర్ షీట్లు దిద్దిన టీచర్లకు గడ్డి పెట్టి ఉంటే వాళ్ళకా అధికారం తొలగించి ఉంటే,ఈ పాటికి తన ప్రతిభకు రావాల్సిన గుర్తింపు అంతా వచ్చేసి ఏ స్మిత్ సోనియన్ ఇన్స్టిటూట్ లోనో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
అంతెందుకు తనకీ తన కాలనీ రోడ్డుకీ ఏ మాత్రమైనా మ్యచింగ్ ఉందా!రోడ్డుమీద వేగంగా నడిచే అవకాశం లేక కదూ జీవితంలోనూ వేగంగా నడవడం చేతకాకుండా పోయింది.దీనిమీద ఒపేనియన్ పోలింగ్ జరిపితే ఎంతమంది తనను సమర్దించి ప్రబుత్వం నుంచి భారీ నష్టపరిహారం ఇప్పించి ఉండే వాళ్ళో!
తనకీ తన అమ్మా,నాన్నలకి తనకీ తన ఆస్తికీ,తనకీ తన ఆలోచనలకీ,తనకీ తన ఆచరనకీ,ఎప్పుడైనా జోడీ కుదిరిందా!ఒక్కరైనా దీనిమీద మీడియాలో ప్రశ్నలడిగి జవాబులు రాబట్టి తనలాంటి వాళ్ళ జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారా? వాపోయాడతను.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొన్నామద్య ఓ తెలుగు న్యూస్ చానల్ ఓ ప్రముఖ తెలుగు హీరో పెళ్ళి విషయమై వాళ్ళిద్దరికీ జోడీ కుదిరిందా అని తన ప్రేక్షకులని ప్రశ్న అడిగింది.
ఇతరుల జీవితాళ్ళోకి చొచ్చుకొని వెళ్ళి ప్రశ్నలడగటం మానవ లక్షణం కాదేమో...!

ఎంత మంచి నమ్మకమో!


ఎంత మంచి నమ్మకమో!

దారి పొడగునా ఎర్ర గుడ్డలు చుట్టిన కొబ్బరి కాయలు.
బస్సు అడుగడుగునా ఆగి వాటిని లోపల వేసుకొని వెళుతోంది.
ఒక్కొక్కసారి ఆ కొబ్బరి కాయలు పట్టుకొని మనుషులెవరూ నిలబడి కూడా ఉండరు.అయినా బస్సులు ఆగి ఎన్ని కాయలుంటే అన్నిటినీ ద్రైవరు సీటు ప్రక్కన సర్దుకొని తీసుకువెళుతున్నాయి.
ఎక్కడికి వెల్తున్నయి ఆ కాయలన్నీ?
ఒరిస్సా లోని ఒక గుడికి.తరనీమాత ఆలయానికి.ఆ గుల్లో రోజూ 20-30 వేల కొబ్బరికాయలు కొడతారట.పండగలప్పుడు లక్ష కూడా కొడతారట.ఒకల్లా తరువాత ఒకరు వేసుకొని పూజారులు ఈ కొబ్బరి కాయల్ని కొడతారట.
ఎవరు పంపుతరు ఈ కాయలన్నీ?
భక్తులు.మొక్కునుబట్టి కాయలు.ఒక్కక్కసారి వాటితోపాటే ముడుపులుకూడా ఉంటాయట.అయినాకూడా బస్సు డైవర్లు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మవారికి అప్పజెప్పేస్తారు.బస్సు అమ్మవారి ఆలయం ఉన్న ఘట్ గావ్ దాకా వెల్లకపోతే ఆ దారిలో వెల్లే కూడలి దగ్గర దింపి వెల్లిపోతారట.అటెల్లే బస్సు వాళ్ళు వాటిని ఎక్కించుకొని తీసుకువెల్తారట.
ఎక్కడా మోసం లేదు.దగా లేదు.కొబ్బరకాయ అమ్మవారిని చేరకపోయె ప్రస్నె లేదు.బద్దకించో,నిర్లక్ష్యం చేసో తీసుకెల్లకపోతే ఇంగిన్ చెడిపోవడమో,ఆక్సిడెంట్ అవడమో జరుగుతుందని ద్రైవర్లతో సహా అందరి నమ్మకమూను.అంత ద్రుడ నమ్మకాలున్నప్పుడు తప్పులకు,పొరపాత్లకీ అవకాసం ఎక్కడా?
ముంబైలో డబ్బావలాలు ప్రతికారేజీని దాని యజమానికి అప్పజెప్పినట్లే,ఉత్తర ఒరిస్సాలోని ప్రతి బక్తుడు-బక్తురాలూ తలచులోవాలేగాని తాము కాలు కదపకుండా తమ నివేదనను అమ్మవారికి పంపించగలరు.
మన ఎడుకొండలవాడూ,ఇతరకొండలపై వున్న తెలుగు దేవుళ్ళు కూడా ఇలంటి వ్యవస్తనొకదానిని నెలకొల్పితే బాగుండు,బక్తులు చీటికీ మాటికీ కొండెక్కి వాళ్ళను డిస్ట్రెబ్ చేయకుండా వుంటే వాళ్ళు లోకకళ్యాణం గురించి కాసేపయినా ఆలోచించగలుగుతారు...

Popular Posts