Monday, 15 December 2014

చక్రి అభిమానిని...:బాలయ్య

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని ...బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని... అతను తన తమ్ముడులాంటివాడన్నారు.


ఇటీవలే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో తాము కలిశామని,... త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు చెప్పారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. బాలకృష్ణ అన్నారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బాలకృష్ణ నటించిన 'సింహ' చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.

Sunday, 14 December 2014

'లింగ' చిత్రం పైరసీ సీడీలు.. గుంటూరులో పోలీసులు సోదాలు!

piracy cd's
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు జిల్లా కేంద్రంలోని అనేక వీడియో షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 
ఇప్పటికే లింగ చిత్రానికి సంబంధించిన 60 వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాటితో పాటు పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న పలు కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సోదాల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒక్క లింగ చిత్రమే కాక, ప్రతి సినిమాకి విడుదలైన మరుక్షణమే వినుకొండలో పైరసీ సీడీని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ తయారయ్యే పైరసీ సీడీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు

Thursday, 11 December 2014

లింగ సినిమా టిక్కెట్ ఖరీదు 12,000 లా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగ' విశ్వవ్యాప్తంగా హంగామా సృష్టిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తం ఏకంగా 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

‘లింగ’ సినిమాకు దేశ విదేశాల్లో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే.. ఇండియన్ ట్రేడ్ పండిట్స్ మతులు పోతున్నాయి. ఒక్క తమిళనాడులోనే కాక.. మిగతా రాష్ట్రాల్లో.. విదేశాల్లో ‘లింగ’ ఫీవర్‌తో పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు.

తమిళనాడులో ఏ సినిమా విడుదల కానన్ని స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలవుతోంది. చెన్నైలోని ఓ థియేటర్‌లో తొలి టికెట్ కోసం వేలం వెయ్యగా ఓ అభిమాని రూ.12 వేలు పెట్టి టికెట్ కొన్నాడంటే ఇక చూసుకోండి 'రింగ' ఎంత రేంజ్‌లో ఉంటుందో.

చెన్నైలో 50 థియేటర్లలో సినిమా ఆడుతుంటే. ఇప్పటిదాకా మరే తమిళ సినిమాకు ఇన్ని థియేటర్లలో ఆడకపోడం విశేషం. తమిళనాడులో కంటే రెట్టింపు థియేటర్లలో తెలుగులో విడుదలవుతోంది లింగ. మరోవైపు కేరళలో ఏకంగా 225 థియేటర్లలో ‘లింగ’ హంగామా చేస్తోంది.

దేశంలోనే కాదు విదేశాల్లో చూస్తే.. ఒక్క అమెరికాలో మాత్రమే 330 స్క్రీన్స్‌లో లింగ విడులవుతుంటే.. ఓ ఇండియన్ మూవీకి ఇంత హంగామా అని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. యూఏఈలోనూ 60 థియేటర్లలో ‘లింగ’ వేస్తున్నారు.

సినిమా విడుదల శుక్రవారమే అయినా.. ముందురోజే విదేశాల్లో భారీగా ప్రిమియర్ షోలు వేస్తున్నారు. మరో వైపు వేలం పాట ద్వారా టికెట్లు అమ్ముతూ భారీ మొత్తం దోచుకుంటున్నారు.

Popular Posts