తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా "ఐ బొమ్మ " వెబ్సైట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెబ్ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ ను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచగా.. ఈ పైరసీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రవిని అరెస్ట్ చేసిన వెంటనే వెబ్ సైట్ ని బ్లాక్ చేసేశారు అధికారులు. కానీ ఐబొమ్మ తరహా లోనే మరో కొత్త వెబ్సైట్ తెరపైకి రావడం అది డైరెక్ట్ గా కొత్త సినిమాలను కూడా ప్రదర్శిస్తుండడం ఆందోళన రేకెత్తించింది. 'ఐబొమ్మ వన్' పేరుతో వచ్చిన ఆ వెబ్ సైట్.. మూవీరూల్జ్ వెబ్ సైట్ కి అది రీ డైరెక్ట్ అవుతూ సినిమాలను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి సరిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది.
SBI పోర్టల్‌కు లింక్.. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లో నుంచి పైరసీ సినిమాలను చూసేందుకు SBI పోర్టల్‌కు లింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకింగ్ వెబ్సైట్ వంటి అత్యంత రక్షణ గల ప్లాట్‌ఫాంలోకి పైరసీ లింక్‌ను చొప్పించడం వెనుక పైరసీ రాకెట్ ఎంత పెద్దదో అనే అనుమానాలను లేవనెత్తుతోంది. SBI term life insurance పోర్టల్‌కు ఐబొమ్మను లింక్ చేశారు. దీంతో ఐబొమ్మకు సంబంధించిన బప్పమ్ టీవీలో లింక్ కాపీ చేసి SBI term life insurance పోర్టల్‌లో పేస్ట్ చేస్తూ సినిమాలు చూస్తున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా బ్యాంకు వెబ్ సైట్ నే హ్యాక్ చేసి దానికి లింక్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇది sbi పోర్టల్ కాదని ఫేక్ sbi పొట్రాల క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారని అంటున్నారు.
ఈ విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా SBI టెక్నికల్ టీం నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐబొమ్మ లింక్ తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రవి పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే ఇలా జరగటంతో రవి వెనక ఎవరెవరున్నారు. ఐబొమ్మను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా తాను ఎన్నడూ పట్టుబడనని.. అతి పెద్ద ప్రభుత్వ వెబ్సైట్లనైనా హ్యాక్ చేయగలనని రవి గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
కాగా రవి 2019 నుంచి ఈయన భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రూ.3,000 కోట్లకు పైగా నష్టం కలిగించారని పోలీసులు వెల్లడించారు. కొన్ని నెలలుగా తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఎదుర్కొంటున్నాడు. విడాకులు కోసం విదేశంలో ఉన్న రవి ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమాచారాన్ని రవితో విభేదాలు ఉన్న భార్య స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. రవి నగరానికి చేరుకున్న వెంటనే, ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు పక్కా ప్రణాళికతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే అత్త, భార్యాల అవమానాల కారణంగానే డబ్బు సంపాదన కోసం వెబ్ సైట్ క్రియేట్ చేసి సినిమాలు అప్లోడ్ చేసినట్టు రవి అంగీకరించారు.